English | Telugu
బంజారాహిల్స్ లో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై 50 ఏళ్ల వృద్ధుడు లైంగిక దాడి
Updated : Dec 12, 2020
అంబేద్కర్ నగర్‌లో నివాసం ఉండే చెన్నయ్య అనే వృద్ధుడు ఇంటి పక్కన ఉన్నవారితో స్నేహం పెంచుకున్నాడు. ఆ ఇంట్లోని నాలుగేళ్ల చిన్నారిని చాక్లెట్లు, బిస్కెట్లు ఇచ్చి మచ్చిక చేసుకున్నాడు. అయితే.. చిన్నారి తల్లి పనికి వెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న నాలుగేళ్ల చిన్నారిని తీసుకెళ్లి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. తల్లి పనినుంచి ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంట్లో చిన్నారి లేకపోవడంతో.. ఇంటి చుట్టు పక్కల వెతుకుతుండగా చెన్నయ్య ఇంట్లో నుంచి చిన్నారి వస్తూ కనిపించింది. చిన్నారి ఏడుస్తుండడం గమనించిన తల్లి.. ఏమయింది అని ఆరా తీయగా అసలు విషయం తెలిసింది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం చెన్నయ్య పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది.