English | Telugu

ఇండియాలో కరోనా వైర‌స్ విజృంభిస్తోంది!

దేశంలో కరోనావైరస్ వ్యాప్తి శ‌ర‌వేగంగా విస్త‌రిస్తోంది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య, మరో వైపు మరణాల సంఖ్య కూడా ఆందోళ‌న‌క‌రంగా పెరుగుతున్నాయి. ఏప్రిల్ 2న 211 జిల్లాకే పరిమితమైన కరోనావైరస్ ఇప్పుడు 430 జిల్లాలకు వ్యాపించంది. దేశంలోని కేసుల్లో 45 శాతం కేలుసు ఆరు ప‌ట్ట‌ణాల్లోనే ఉన్న‌ట్లు గుర్తించారు. మూడువేలకు పైగా కేసులతో ముంబై అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత ఢిల్లీ 2081, అహ్మదాబాద్ 1298, ఇండోర్ 915, పుణె 660, జైపూర్ 537 కేసులతో ఉన్నాయి. రోజు రోజుకు దేశ వ్యాప్తంగా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది.

ఇప్పటి వరకు దేశంలో 21,370 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 681 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 16,319 కరోనా యాక్టివ్ కేసులు ఉండగా, 4370 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. బుధవారం ఒక్క రోజే 49 మరణాలు సంభవించాయి.

మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాల్లో 60 కన్నా ఎక్కువ కేసులు నమోదు కావడం గమనార్హం. మహారాష్ట్రలో 5649 కరోనా కేసులు నమోదు కాగా, 269 మరణాలు సంభవించాయి. గుజరాత్ రాష్ట్రంలో 2407 కేసులు నమోదు కాగా, 103 మరణాలు సంభవించాయి. ఢిల్లీలో 2248 కేసులు నమోదు కాగా, 148 మరణాలు సంభవించాయి. రాజస్థాన్ రాష్ట్రంలో 1888 కరోనా కేసులు, 127 మరణాలు చోటు చేసుకున్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 1587 కేసులు, 80 మరణాలు సంభవించాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 1449 కేసులు, 21 మరణాలు సంభవించాయి. తెలంగాణలో 943 కరోనా కేసులు, 24 మరణాలు, ఏపీలో 813 కరోనా కేసులు, 24 మరణాలు సంభవించాయి.

ఇప్పటివరకు క‌రోనా మహమ్మారి వల్ల వరల్డ్‌వైడ్‌గా 180,289 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. 25,96,383 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అమెరికా పరిస్థితి మరి దారుణంగా ఉంది. యూఎస్‌లో ఇప్పటివరకు 45,153 మంది మృత్యువాత పడగా, 8.29 లక్షల మంది కరోనా బాధితులు ఉన్నారు. అమెరికా తర్వాత ఇటలీలో 25,085, స్పెయిన్‌లో 21,717, ఫ్రాన్స్‌లో 21,340, బ్రిటన్‌లో 18,100 మంది ఈ మహమ్మారి వల్ల మరణించారు. ఇక భారత్‌లో కూడా 'కొవిడ్‌-19' శరవేగంగా విస్తరిస్తోంది. ఇప్పటివరకు 20,471 మంది కరోనా బారిన పడ్డారు. 652 మంది మరణించారు. తెలంగాణలో 943 కరోనా కేసులు, 24 మరణాలు, ఏపీలో 813 కరోనా కేసులు, 24 మరణాలు సంభవించాయి.