English | Telugu

విజయవాడలో కేంద్ర బృందం పర్యటన!

కరోనాను అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను తెలుసుకునేందుకు శుక్రవారం ఉదయం కేంద్ర వైద్య బృందం నగరంలో పర్యటిస్తోంది. ఈ సందర్భంగా రాష్ట్ర ఆరోగ్యశాఖ చీఫ్ సెక్రటరీ జవహర్‌రెడ్డితో కేంద్ర బృందం భేటీ అయ్యింది. రాష్ట్రంలో కరోనా నియంత్రణ కోసం తీసుకుంటున్న చర్యల వివరాలు అడిగి తెలుసుకుంది. అలాగే కర్నూలు, గుంటూరులో కరోనా ఎక్కువగా వ్యాప్తికి గల కారణాలను కేంద్ర బృందం ఆరా తీసింది. కరోనా బారిన పడిన వారికి అందుతున్న వైద్య సహాయంపై చర్చించింది.

రాష్ట్రంలో కేసుల వివరాలను కేంద్రబృందం అడిగి తెలుసుకుంది. అలాగే రోగులకు ఎలాంటి చికిత్స అందిస్తున్నది తెలుసుకుంటున్నారు. అనంతరం రాష్ట్రంలో కరోనా కట్టడికి తీసుకున్న చర్యలపై కేంద్ర బృందానికి వైద్యారోగ్య శాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ఇచ్చారు. అలాగే ఇంటింటి సర్వే వివరాలను కేంద్రబృందానికి అధికారులు వివరిస్తున్నారు.