English | Telugu

వైద్య సేవల్ని పునః ప్రారంభించిన కేర్!

ఔట్ పేషంట్ డిపార్ట్‌మెంట్‌లను గ్లాస్ పార్టీషన్స్‌తో పునః రూపకల్పన చేశాం. తద్వారా రోగి మరియు డాక్టర్ నడుమ కాంటాక్ట్‌ను వీలైనంతగా తగ్గించాం. అలాగే ఎవరైనా ప్రాంగణం లోపలకు అడుగుపెడితే, మూడు దశల స్క్రీనింగ్ ప్రక్రియను వారు దాటాల్సి ఉంటుంది. శస్త్రచికిత్స కోసం వచ్చే రోగులకు మేము ఇప్పుడు సింగిల్ రూమ్స్‌ను కేటాయిస్తున్నాం అలాగే విభిన్నమైన వైద్య అవసరాల కోసం విభిన్నమైన వైద్య బృందాలను కేటాయిస్తున్నాం. తద్వారా కేవలం ఆ డాక్టర్ మరియు నిర్ధేశించిన పారామెడిక్ వ్యక్తులు మాత్రమే రోగి వద్ద కు చేరతాదరనే భరోసానూ కలిగిస్తున్నాం” అని లెఫ్టినెంట్ జనరల్ డాక్టర్ ఏకె దాస్అన్నారు.

కోవిడ్-19 వ్యాప్తి చెందడం కారణంగా ఆస్పత్రులకు వచ్చే రోగుల సందర్శనలపై కూడా పలు నియంత్రణలను విధించింది. ఆఖరకు అతి తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న వారు సైతం ఈ మహమ్మారి కారణంగా హెల్త్‌కేర్ ఇనిస్టిట్యూషన్స్‌ను సందర్శించకుండా ఇది అడ్డుకుంది. “అయితే, గతంలోనే వైద్య పరమైన చికిత్స అవసరమై ఉండి తక్షణమే వైద్య సహాయం అందుకోవాల్సిన వారు ఎక్కువ కాలం తమ చికిత్సను ఆలస్యం చేసుకోవడం సూచనీయం కాదు.

ఎందుకంటే వారు ఈ అంటువ్యాధుల బారిన పడేందుకు ఎక్కువ ఆస్కారం ఉంటుంది మరియు కొంతమంది ఆరోగ్యంపై కూడా అది తీవ్ర ప్రభావం చూపవచ్చు” అని డాక్టర్ నిఖిల్ మాథుర్ అన్నారు.

“ప్రభుత్వం ఇప్పుడు పాక్షికంగా నిబంధనలను సడలించడం కారణంగా కేర్ హాస్పిటల్స్ తమ సాధారణ పేషంట్ కేర్‌ను పూర్తి స్థాయిలో విస్తృతమైన ముందు జాగ్రత్త చర్యలు, భౌతిక దూర మార్గదర్శకాలను అమలులోకి తీసుకువచ్చి అందిస్తుంది. కేర్ హాస్పిటల్స్ వద్ద, మా రోగుల ఆరోగ్యం, భద్రత అనేవి అతి ముఖ్యమైనవి మరియు అవసరమైన అంటువ్యాధుల నియంత్రణ మార్గదర్శకాలకు కట్టుబడి ఉండటం ద్వారా వారి భద్రత మరియు చక్కటి ఆరోగ్యానికి హామీనిస్తుంది”.

మిషన్ సురక్షః కోవిడ్ -19 నేపథ్యంలో సాధారణ పరిస్ధితులను పునరుద్ధరించడానికి కట్టుబడిన కేర్ హాస్పిటల్స్
అత్యంత కఠినమైన భౌతిక దూరం మరియు అంటువ్యాధులను నియంత్రించేందుకు అంటువ్యాధుల నియంత్రణ మార్గదర్శకాలను అమలు చేస్తోంది. ఔట్ షేషంట్ డిపార్ట్‌మెంట్స్ (ఓపీడీలు), ఎలిక్టివ్ కేర్ సేవలు సహా తమ అన్ని వైద్య సేవలనూ పునః ప్రారంభిస్తున్నట్లు కేర్ హాస్పిటల్స్ వెల్లడించింది.