English | Telugu

ఎన్నికల కమిషనర్ పదవీకాలం కుదింపు ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదముద్ర

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవి కాలాన్ని మూడేళ్లకు తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పంపిన ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోద ముద్ర వేశారు దీనికిరాష్ట్ర న్యాయ శాఖా కూడా ఆమోదం తెల్పింది. దీని ఆధారంగా రాష్ట్ర ఎన్నిక కమిషనర్ పదవికాలం మూడేళ్లు గడచి పోయిందని పేర్కొంటూ పంచాయతీరాజ్ శాఖా ఆదేశాలు ఇచ్చింది. జీఓ 31 న్యాయ శాఖా 617, 618 పంచాయతీరాజ్ శాఖా ఇచ్చాయి. ఇక్కడ తొలగింపు అనడానికి అవకాశం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది.

అయితే, ఆర్టికిల్ 243K ప్రకారం ఎన్నికల కమిషనర్ ను గవర్నర్ అపాయింట్ చేస్తారు. మన రాష్ట్రంలో ఎన్నికల కమిషనర్ కు హైకోర్టు జడ్జి స్థాయి కల్పించారు. ఒకసారి నియమించిన తరువాత సుప్రీం కోర్ట్ స్థాయి జడ్జి అనుమతి లేనిదే అతని పదవీకాలం కుదించడం గానీ, అర్హతలను మార్చడం గానీ చేయరాదు. ఇప్పుడు ఏ పీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈ నిబంధనలన్నింటినీ అతిక్రమించే రీతిలో కథ నడిపించారని నిపుణులు అంటున్నారు. ఒకవేళ ఏ చట్టం ద్వారా అయితే ఎన్నికల కమిషనర్ నియమించబడ్డారో, ఆ చట్టాన్ని మారిస్తే గనుక ఇది సాధ్యం అయ్యే అవకాశం ఉందనేది వారి అభిప్రాయం. చట్టం తీసుకురావాలంటే సభ కొలువుదీరాలి, మండలి ఆమోదించాలి, ఇవన్నీ జరగవు కాబట్టి ప్రభుత్వం ఆర్డినెన్సు విడుదల చేసింది. అయితే, ఈ ఆర్డినెన్సు కోర్టులో చెల్లుతుందా అనేది వేచి చూడాలి.