English | Telugu
ఏపీ సీఎస్ పదవీకాలం పొడిగింపు
Updated : Jun 3, 2020
నీలం సాహ్ని పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. అయితే, కరోనా నేపథ్యంలో సీఎస్ విధులు కీలకమైనందున ఆమె పదవీ కాలం మరో 6 నెలలు పొడిగించాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖకు సీఎం వైఎస్ జగన్ లేఖ రాశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకూ నీలం సాహ్ని పదవీ కాలాన్ని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.