English | Telugu

తెలంగాణలో మ‌రొక‌రు మృతి, 592కి చేరిన కరోనా కేసులు!

సోమ‌వారం ఒక రోజే తెలంగాణ వ్యాప్తంగా 61 నూత‌న కరోనా పాజిటివ్ కేసులు నిర్ధార‌ణ అయ్యాయి. దీంతో తెలంగాణాలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మొత్తం 592కి చేరింద‌ని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.

మ‌రొక‌రు మృతి చెంద‌డంతో ఇప్ప‌ట్టి వ‌ర‌కు కరోనాతో మృతి చెందిన వారిక సంఖ్య 17కు పెరిగింది. క‌రోనా నుంచి కోలుకుని, డిశ్చార్జ్‌ చేసిన అయిన వారి సంఖ్య 103కాగా వారు పూర్తిగా కోలుకున్నారు. మిగిలిన 472 మంది చికిత్స పొందుతున్నారు.
ఎక్కువ కేసులు హైద‌రాబాద్ జీహెచ్ఎంసీ ప‌రిధిలోనే న‌మోదువుతున్నాయని ప్ర‌భుత్వం తెలిపింది.