English | Telugu

Balakrishna: మళ్ళీ సింగర్ గా మారిన బాలయ్య.. ఏ సినిమా కోసమో తెలుసా..?

నటసింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) అప్పుడప్పుడు సినిమా వేడుకల్లో పాటలు పాడి అభిమానుల్లో జోష్ నింపుతూ ఉంటారు. అలాగే 'పైసా వసూల్' సినిమాలో 'మామ ఏక్ పెగ్ లా' అనే సాంగ్ పాడి మెప్పించారు. ఇక ఇప్పుడు ఆయన మరోసారి ఓ సినిమా కోసం గాయకుడిగా మారుతున్నట్లు తెలుస్తోంది.

అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్, అఖండ-2 .. ఇలా వరుసగా ఐదు 100 కోట్ల గ్రాస్ సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నారు బాలకృష్ణ. తన తదుపరి సినిమాని గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్నారు. బాలయ్య కెరీర్ లో 111వ సినిమాగా రూపొందుతోన్న ఈ ప్రాజెక్ట్ కి 'NBK111' అనేది వర్కింగ్ టైటిల్. వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్న ఈ హిస్టారికల్ ఫిల్మ్ లో నయనతార హీరోయిన్.

అనౌన్స్ మెంట్ తోనే 'NBK111'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు ఆ అంచనాలను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళే న్యూస్ వినిపిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా కోసం బాలకృష్ణ సింగర్ గా మారుతున్నట్లు సమాచారం. ఈ సాంగ్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుందట. ఆ సాంగ్ కి బాలయ్య వాయిస్ అయితే బాగుంటుందనే ఉద్దేశంతో మూవీ టీం అడగగా.. ఆయన ఓకే చెప్పినట్లు వినికిడి.

Also Read: అప్పుడు ఎన్టీఆర్.. ఇప్పుడు చిరంజీవి.. నిజమేనా..?

అసలే బాలకృష్ణ సినిమా అంటే తమన్ ఎలాంటి మ్యూజిక్ ఇస్తాడో తెలిసిందే. అలాంటిది స్వయంగా బాలయ్యనే సింగర్ గా మారితే.. ఇక తమన్ మ్యూజిక్ ఏ రేంజ్ లో ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.