English | Telugu
రామ్‌తో హరీశ్ శంకర్ సినిమా!?
Updated : May 14, 2022
కమర్షియల్ ఎంటర్టైనర్స్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన దర్శకుల్లో హరీశ్ శంకర్ ఒకరు. `మిరపకాయ్` (2011), `గబ్బర్ సింగ్` (2012), `సుబ్రమణ్యం ఫర్ సేల్` (2015), `డీజే` (2017), `గద్దలకొండ గణేశ్` (2019) వంటి విజయవంతమైన సినిమాలతో అలరించిన హరీశ్ శంకర్.. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో `భవదీయుడు భగత్ సింగ్` తెరకెక్కించే పనుల్లో బిజీగా ఉన్నారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ బాట పట్టనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. వచ్చే ఏడాది జనం ముందుకు రానుంది.
ఇదిలా ఉంటే, `భవదీయుడు భగత్ సింగ్` సెట్స్ పైకి వెళ్ళకముందే మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ ని సెట్ చేశారట హరీశ్. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనితో ఈ సినిమా రూపొందనుందని.. ఇప్పటికే కథా చర్చలు కూడా జరిగాయని టాక్. అంతేకాదు.. 2023 ఆరంభంలో ఈ చిత్రం ప్రారంభమయ్యే అవకాశముందని వినిపిస్తోంది. మరి.. ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచి చూడాల్సిందే.
కాగా, రామ్ తాజా చిత్రం `ద వారియర్` జూలై 14న రిలీజ్ కాబోతోంది. ఆపై మాస్ సినిమాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీనుతో ఓ పాన్ - ఇండియా ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. అదయ్యాకే.. హరీశ్ శంకర్ కాంబో మూవీ ఉండొచ్చన్నది బజ్.