English | Telugu
రవితేజతో ధనుష్ దర్శకుడి సినిమా!?
Updated : May 14, 2022
వరుస చిత్రాలతో ఫుల్ జోష్ లో ఉన్నారు మాస్ మహరాజా రవితేజ. ప్రస్తుతం ఈ స్టార్ హీరో చేతిలో `రామారావు ఆన్ డ్యూటీ`, `ధమాకా`, `రావణాసుర`, `టైగర్ నాగేశ్వర రావు` సినిమాలున్నాయి. అలాగే, మెగాస్టార్ చిరంజీవి - దర్శకుడు బాబీ కాంబో మూవీలోనూ ఓ స్పెషల్ రోల్ లో రవితేజ ఎంటర్టైన్ చేయనున్నట్లు బజ్.
ఇదిలా ఉంటే, తాజాగా రవితేజ ఓ తమిళ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే.. ఆ మధ్య వెర్సటైల్ హీరో సిద్ధార్థ్ తో `లవ్ ఫెయిల్యూర్` (2012), కోలీవుడ్ స్టార్ ధనుష్ తో `మారి` (2015), `మారి 2` (2018) చిత్రాలను తెరకెక్కించిన యువ దర్శకుడు బాలాజీ మోహన్.. ఇటీవల రవితేజని సంప్రదించి ఓ ఆసక్తికరమైన కథ వినిపించారట. అది నచ్చడంతో.. రవితేజ ఈ ప్రాజెక్ట్ కి వెంటనే ఓకే చెప్పారని టాక్. అంతేకాదు.. ఓ ప్రముఖ బాలీవుడ్ నిర్మాత ఈ మల్టిలింగ్వల్ మూవీని ప్రొడ్యూస్ చేస్తారని వినిపిస్తోంది. అలాగే, వచ్చే ఏడాది ఆరంభంలో పట్టాలెక్కనున్న ఈ సినిమాలో రవితేజ ఇదివరకెన్నడూ కనిపించని పాత్రలో నటిస్తారట. త్వరలోనే రవితేజ - బాలాజీ మోహన్ కాంబినేషన్ మూవీకి సంబంధించి క్లారిటీ రానున్నది.