English | Telugu
ప్రభాస్‌తో కియారా/రష్మిక రొమాన్స్!?
Updated : May 13, 2022
`సాహో` నుంచి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. గతంలో తనతో రొమాన్స్ చేయని కథానాయికలతోనే జట్టుకడుతున్నాడు. `సాహో`లో శ్రద్ధా కపూర్ తో తొలిసారిగా కలిసి నటించిన ప్రభాస్.. గత చిత్రం `రాధే శ్యామ్`లో పూజా హెగ్డే తో ఫస్ట్ టైమ్ స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. సంక్రాంతికి రాబోయే `ఆదిపురుష్`లోనూ కృతి సనన్ తో మొదటిసారి జతకట్టిన ఈ ఉప్పలపాటి వారి హ్యాండ్సమ్ హీరో.. ఆపై వచ్చే `సలార్`లోనూ శ్రుతి హాసన్ తో తొలిసారిగా జట్టుకట్టాడు. అలాగే `ప్రాజెక్ట్ కె`లోనూ దీపికా పదుకోణ్, దిశా పటానితో మొదటిసారి ఆడిపాడనున్నాడు.
ఇదిలా ఉంటే, `అర్జున్ రెడ్డి` ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ ఓ పాన్ - ఇండియా ప్రాజెక్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. `స్పిరిట్` పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాలోనూ ప్రభాస్ కి ఫ్రెష్ జోడీని సెట్ చేయనున్నాడట సందీప్. కుదిరితే బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానిని లేదంటే నేషనల్ క్రష్ రష్మికా మందన్నని `స్పిరిట్`లో నటింపజేసే ప్రయత్నాలు చేస్తున్నాడట సందీప్. మరి.. వీరిద్దరిలో ప్రభాస్ సరసన కనిపించే లక్కీ ఛాన్స్ ఎవరికి దక్కుతుందో చూడాలి.