Read more!

English | Telugu

'అఖండ' క‌లెక్ష‌న్ల‌ను త‌ట్టుకోలేక దిగాలుప‌డ్డ వ్య‌తిరేక వ‌ర్గం!

 

నంద‌మూరి బాల‌కృష్ణ టైటిల్ రోల్ పోషించిన 'అఖండ' మూవీ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర విజ‌య ఢంకా మోగిస్తోంది. ఈ ఏడాది ఇప్ప‌టివ‌ర‌కూ థియేట‌ర్ల‌లో రిలీజైన సినిమాల‌లో 'వ‌కీల్ సాబ్' త‌ర్వాత సెకండ్ ప్లేస్‌ను ఆక్ర‌మించేందుకు ఉర‌క‌లు వేస్తోన్న 'అఖండ' మూవీ ఓవ‌ర్సీస్‌లోనూ గ‌ర్జిస్తుండ‌టం విశేషంగా చెప్పుకుంటున్నారు. టైటిల్ రోల్‌లో బాల‌య్య ప్ర‌ద‌ర్శించిన న‌ట‌న‌కు మాస్ ఆడియెన్స్ నీరాజ‌నాలు ప‌డుతున్నార‌నేందుకు క‌లెక్ష‌న్లే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. 

'అఖండ' ఈ స్థాయిలో బాక్సాఫీస్‌ను దున్నేయ‌డానికి కార‌ణ‌మేంటి?  బాల‌య్య బాక్సాఫీస్ వ‌ద్ద సృష్టిస్తోన్న ప్ర‌భంజనాన్ని చూసి ఓర్వ‌లేక‌పోతున్న వ్య‌తిరేక వ‌ర్గం ఇదంతా ఒక కులం ఆ సినిమాపై తీసుకొచ్చిన హైప్ ప్ర‌భావ‌మంటూ ప్ర‌చారం చేయ‌డానికి ఆప‌సోపాలు ప‌డుతోంది. ఆన్‌లైన్‌లో ఈ మేర‌కు పోస్టులు కూడా పెడుతోంది. ఇండ‌స్ట్రీలో ఆ కులానికి చెందిన ఒక యంగ్ ప్రొడ్యూస‌ర్ దీని వెనుక ఉన్నాడ‌ని కూడా ప్ర‌చారం చేసింది. 

Also read:  'అఖండ' జాత‌ర‌.. నాలుగు రోజుల్లోనే తెలంగాణ‌లో లాభాలు!

అయితే ఆ ప్ర‌చారం చూసి ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు న‌వ్వుకుంటున్నాయి. 'అఖండ' దెబ్బ‌కు వ్య‌తిరేక వ‌ర్గం ఎంత ఫ్ర‌స్ట్రేష‌న్‌లో ఉంద‌నేందుకు ఆ రాత‌లే నిద‌ర్శ‌న‌మ‌ని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు. 'అఖండ' విజ‌యాన్ని జీర్ణంచేసుకోలేక పోవ‌డం వ‌ల్లే ఇలాంటి హైప్ క‌థ‌నాలు వండి వారుస్తున్నార‌నీ, అయితే అలాంటి రాత‌లు చూసి వారిపై జాలి క‌లుగుతోంద‌ని అంటున్నారు.

Also read:  నాలుగో రోజు క‌లెక్ష‌న్‌లో 'వ‌కీల్ సాబ్‌'ను దాటేసిన 'అఖండ'!

ఒక సినిమాపై ఎవ‌రెంత హైప్ క్రియేట్ చేసినా, దాని ప్ర‌భావం మొద‌టి రోజు ఒక‌ట్రెండు షోల‌కు ప‌రిమిత‌మ‌వుతుంద‌నీ, ఆ త‌ర్వాత ఆ సినిమా ఎలా ఉంద‌నే దానిపై ఆధార‌ప‌డి క‌లెక్ష‌న్లు ఉంటాయ‌నే వాస్త‌వాన్ని కూడా ఆ ప్ర‌చార‌క‌ర్త‌లు గ్ర‌హించ‌లేక‌పోతున్నారు. ఆ ర‌కంగా చూసుకుంటే మొద‌టి రోజు బ్ర‌హ్మాండ‌మైన ఓపెనింగ్స్ సాధించిన 'అఖండ‌', రెండో రోజు కూడా కేవ‌లం తెలుగు రాష్ట్రాల్లోనే రూ. 6 కోట్ల‌కు పైగా షేర్ సాధించ‌డం, మూడో రోజు, నాలుగు రోజుల్లో అంత‌కంటే ఎక్కువ వ‌సూళ్లు రావ‌డం ఆ సినిమా ప్ర‌భంజ‌నం ఎలా ఉందో చెప్ప‌డానికి నిద‌ర్శ‌న‌మ‌నీ విశ్లేష‌కులు అంటున్నారు.

Also read:  బాలీవుడ్ బాట‌లో బాల‌య్య `అఖండ‌`?

ఇప్ప‌టికే తెలంగాణ ఏరియాలో ప్రాఫిట్‌లోకి వ‌చ్చేసిన 'అఖండ‌', రానున్న కొద్ది రోజుల్లోనే మిగ‌తా అన్ని ఏరియాల్లోనూ లాభాల్లోకి వ‌స్తుంద‌ని చెప్ప‌డానికి సందేహించాల్సిన ప‌నిలేదు.