Home

»

Latest News

'అఖండ' జాత‌ర‌.. నాలుగు రోజుల్లోనే తెలంగాణ‌లో లాభాలు!

Dec 06, 2021

 

'అఖండ'గా బాలకృష్ణ‌ ప్ర‌భంజ‌నానికి బాక్సాఫీస్ ద‌ద్ద‌రిల్లుతోంది. కెరీర్‌లోనే బెస్ట్ ఫిగ‌ర్స్‌ను న‌మోదు చేస్తూ బాల‌య్య దూసుకుపోతున్నారు. నాలుగు రోజుల్లో 'అఖండ' సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ. 37.56 కోట్ల షేర్‌ను సాధించి, విశ్లేష‌కుల‌ను విస్మ‌య‌ప‌రిచింది. ఈ క్ర‌మంలో తెలంగాణ ఏరియాలో బ్రేకీవెన్ సాధించేసి, డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు లాభాలు పంచ‌డం కూడా మొద‌లుపెట్టేసింది. తెలంగాణ ప్రాంతానికి దిల్ రాజు రూ. 10.5 కోట్ల‌కు ఈ సినిమా పంపిణీ హ‌క్కుల్ని కొనుగోలు చేశారు. నాలుగు రోజుల్లోనే ఈ ప్రాంతంలో రూ. 12.11 కోట్ల షేర్‌ను రాబ‌ట్టింది 'అఖండ‌'.

Also read:  బాలీవుడ్ బాట‌లో బాల‌య్య `అఖండ‌`?

తెలంగాణ‌లో తొలి రోజు రూ. 4.39 కోట్ల షేర్‌తో బాల‌య్య సినిమాల్లోనే అత్య‌ధిక ఓపెనింగ్స్ సాధించిన రికార్డ్ సొంతం చేసుకున్న ఈ మూవీ రెండో రోజు రూ. 2.26 కోట్లు, మూడో రోజు రూ. 2.51 కోట్లు, నాలుగో రోజు 2.95 కోట్ల‌ను వ‌సూలు చేసిన‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు తెలిపాయి. ఈ క‌లెక్ష‌న్ల జాత‌ర చూసి దిల్ రాజు సైతం విస్మ‌యానికి గుర‌యిన‌ట్లు ఆయ‌న స‌న్నిహిత వ‌ర్గాలు తెలిపాయి. 

Also read:  అప్పుడు 'లెజెండ్'.. ఇప్పుడు 'అఖండ‌'..! అదే ప‌రిస్థితి!!

సెకండ్ లాక్‌డౌన్ త‌ర్వాత విడుద‌లైన తొలి భారీ సినిమా కావ‌డంతో 'అఖండ‌'పై అంద‌రి క‌ళ్లూ నిలిచాయి. విడుద‌ల‌కు ముందు ఫిల్మ్ ఇండ‌స్ట్రీకి 'అఖండ' ఊపు తెచ్చింద‌ని య‌స్‌.య‌స్‌. రాజ‌మౌళి సైతం ప్ర‌శంసించిన ఈ సినిమా అంచ‌నాల‌కు మించిన క‌లెక్ష‌న్ల‌తో నిజంగానే ఇండ‌స్ట్రీకి ఊపునిచ్చింది. ఎగ్జిబిష‌న్ రంగానికి ఊపిరిపోసింది. తొలి వారం ముగిసేస‌రికి మ‌రిన్ని ఏరియాల్లో బ్రేకీవెన్ సాధించి, బ‌య్య‌ర్ల‌కు ఆనందాన్నిస్తుంద‌ని ఆశిస్తున్నారు.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com