Read more!

English | Telugu

ఈ లోకం నీకు తుపాకి ఇచ్చింది.. నాకు గొడ్డలి ఇచ్చింది.. 'పుష్ప' ట్రైల‌ర్‌ బెస్ట్ మూమెంట్స్‌!

 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టైటిల్ రోల్ పోషిస్తుండ‌గా, సుకుమార్ డైరెక్ట్ చేస్తోన్న‌ రెండు భాగాల 'పుష్ప' మూవీలోని ఫ‌స్ట్ పార్ట్ 'పుష్ప: ది రైజ్' ట్రైల‌ర్ ఎట్ట‌కేల‌కు మ‌న ముందుకు వ‌చ్చేసింది. ప్రొడ‌క్ష‌న్ హౌస్ అయిన మైత్రి మూవీ మేక‌ర్స్ ముందుగా ప్ర‌క‌టించిన‌ట్లు సోమ‌వారం సాయంత్రం 6:03 గంట‌ల‌కు కాకుండా రాత్రి 9:18 గంట‌ల‌కు యూట్యూబ్‌లో ట్రైల‌ర్‌ను రిలీజ్ చేశారు. హైవోల్టేజ్ ఇంటెన్స్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా త‌యార‌వుతున్న ఈ సినిమాలో ఎర్ర‌చంద‌నాన్ని స్మ‌గ్లింగ్ చేసే లారీ డ్రైవ‌ర్ పుష్ప‌రాజ్‌గా నెవ‌ర్ బిఫోర్ 'రా లుక్‌'లో క‌నిపిస్తున్నాడు బ‌న్నీ. ఇప్ప‌టికే "త‌గ్గేదే లే" అంటూ ఆయ‌న చెప్పిన ఊత‌ప‌దం ఎంత వైర‌ల్‌ అయ్యిందో మాట‌ల్లో చెప్ప‌లేం. టీవీ షోల‌లోనూ, బ‌య‌టా కూడా ఆ ప‌దాన్ని విప‌రీతంగా వాడుతూ ర‌చ్చ ర‌చ్చ చేస్తున్నారు. అలాగే ఈ సినిమాలో భుజాన్ని పైకెగ‌రేస్తూ బ‌న్నీ ప్ర‌ద‌ర్శించిన మేన‌రిజం కూడా ఆడియెన్స్‌ను తెగ అల‌రించింది.

రెండున్న‌ర నిమిషాల నిడివి వున్న పుష్ప ట్రైల‌ర్ "భూమండ‌లం మీద యాడా పెర‌గ‌ని సెట్టు మ‌న శేషాచ‌లం అడ‌వుల్లో పెర‌గ‌తా ఉండాది.." అంటూ అజ‌య్ ఘోష్ వాయిస్ ఓవ‌ర్ వినిపిస్తుండ‌గా మొద‌లైంది. శేషాచ‌లం అడవుల్లో జరిగే ఎర్ర చందనం స్మగ్లింగ్‌కు సంబంధించి వచ్చే విజువల్స్ వేరే లెవ‌ల్లో ఉన్నాయి. సీమ యాస‌లో అల్లు అర్జున్ చెప్పే డైలాగ్స్ కానీ, ఆయ‌న ప‌ర్ఫార్మెన్స్ కానీ అల్టిమేట్ అనే రేంజ్‌లో క‌నిపిస్తున్నాయి. ఆయన న‌వ్వు కానీ, ఆయ‌న కోపం కానీ, హీరోయిన్ ర‌ష్మిక‌తో ఆయ‌న రొమాన్స్ కానీ అమితంగా ఆక‌ట్టుకుంటున్నాయి.

Also read:  సీక్రెట్‌గా వీడియో తీస్తున్న ఫ్యాన్‌.. ఫోన్ లాగేసుకున్న యాక్ష‌న్ స్టార్‌!

పుష్ప‌రాజ్‌ను పోలీసులు స్టేష‌న్‌లో బంధించి, లాఠీల‌తో కొడుతుండ‌గా, య‌స్సై పాత్ర‌ధారి శ‌త్రు "యాడ‌దాచినావ్ స‌రుకు.. సెప్పు" అని అడుగుతాడు. "సెబితే మా బాస్ సంపేస్తాడు" అంటాడు పుష్ప‌. "ఎవ‌డాడు.. ఎవ‌డా బాసూ" అని కోపంగా అడిగాడు య‌స్సై. దాందో అదోలా న‌వ్వాడు పుష్ప‌. క‌ట్ చేస్తే.. త‌న సామ్రాజ్యంలో బాస్‌గా ద‌ర్శ‌న‌మిచ్చాడు పుష్ప‌. అంటే పుష్ప‌రాజే ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ ముఠాకు బాస్ అన్న‌మాట‌. ట్రైల‌ర్ చివ‌ర‌లో "పుష్ప అంటే ఫ్ల‌వ‌ర్ అనుకుంటివా.. ఫైరు" అని బ‌న్నీ చెప్పిన విధానం ఆక‌ట్టుకుంది.

Also read:  'జై ప‌వ‌ర్‌స్టార్' అని అన‌లేక‌పోయిన బ‌న్నీ 'జై బాల‌య్య' అని ఎలా అన‌గ‌లిగాడు?

మెయిన్ విల‌న్‌గా గుండుతో స్ట‌న్నింగ్ లుక్‌లో ద‌ర్శ‌న‌మిచ్చినాడు మ‌ల‌యాళం స్టార్ యాక్ట‌ర్ ఫ‌హాద్ ఫాజిల్‌. సునీల్‌, అన‌సూయ‌, ధ‌నుంజ‌య్‌, అజ‌య్ ఘోష్‌, అజ‌య్‌, రావు ర‌మేశ్ లాంటి ఉద్ధండులు ఈ ట్రైల‌ర్‌లో క‌నిపించారు. ప్ర‌తి ఒక్క‌రూ ఇదివ‌ర‌కు వారెప్పుడూ క‌నిపించ‌ని త‌ర‌హాలో డిఫ‌రెంట్ లుక్‌తో క‌నిపిస్తుండ‌టం గ‌మ‌నించ‌ద‌గ్గ అంశం. ఒక సీన్‌లో సునీల్‌ను మంచంపైకి తోసి, అత‌నిపై కూర్చొంది అన‌సూయ‌. ఆమె నోరు ఒక బ్లేడును ప‌ళ్ల‌తో బిగించి ప‌ట్టుకొని ఉండ‌టం ఇక్క‌డ ఆస‌క్తిక‌రం.

అలాగే ట్రైలర్‌లో బన్నీ, రష్మిక మధ్యే వచ్చే రెండు మూడు సన్నివేశాలు కూడా చాలా బాగున్నాయి. ఒక సీన్‌లో "నేను నిన్ను సూళ్లేద‌ని ఓ పులుపెక్కి పోతుండావ‌ట క‌దా" అని శ్రీ‌వ‌ల్లి (ర‌ష్మిక‌) తిప్పుకుంటా అంటే, "పులుపెక్కిపోతుండానా!" అని పుష్ప ఆశ్చ‌ర్య‌పోవ‌డం భ‌లే ఉండాది. 

Also read:  ప్ర‌భాస్ 'ఆదిపురుష్' డైరెక్ట‌ర్ ఓం రౌత్ గురించి మీకెంత తెలుసు?

ఈ ట్రైల‌ర్‌తో 'పుష్ప‌'పై అంచ‌నాలు డెఫినెట్‌గా ఓ రేంజ్‌కు వెళ్లిపోయాయి. త‌న టేకింగ్‌తో సుకుమార్ 'పుష్ప‌'ను ఒక అసాధార‌ణ చిత్రంగా మ‌లిచాడ‌నే న‌మ్మ‌కాన్ని ఈ ట్రైల‌ర్ క‌లిగిస్తోంది. మిరోస్లావ్ క్యూబా బ్రోజెక్ సినిమాటోగ్ర‌ఫీ గురించి ఎంత ఎక్కువ‌గా చెప్పినా త‌క్కువే. దేవి శ్రీ‌ప్ర‌సాద్ బీజిఎం కూడా ఇంట‌ర్నేష‌న‌ల్ స్టాండ‌ర్డ్స్‌ను త‌ల‌పిస్తోంది. డిసెంబ‌ర్ 17న థియేట‌ర్ల‌లో రిలీజ‌వుతోన్న 'పుష్ప: ది రైజ్‌' బాక్సాఫీస్ ద‌గ్గ‌ర చేసే బీభ‌త్సాన్ని చూడ్డ‌మే మిగిలుంది.