English | Telugu
"నువ్వే నా ప్రాణాధారం".. ప్రియుడి కౌగిలిలో ఆమిర్‌ఖాన్ కుమార్తె!
Updated : Jun 1, 2021
బాలీవుడ్ సూపర్‌స్టార్ ఆమిర్‌ఖాన్ కుమార్తె ఇరా ఖాన్ పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతోంది. ప్రియుడు, తన ఫిట్నెస్ ట్రైనర్ అయిన నూపుర్ శిఖారేతో సన్నిహితంగా ఉన్న పలు ఫొటోలను షేర్ చేస్తూ, తన ప్రేమను ప్రపంచానికి బాహాటంగా చాటి చెబుతోంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌ను ఇప్పుడు నూపుర్ ఆక్రమించేశాడు. నూపుర్‌తో కలిసి దిగిన అనేక ఫొటోలతో ఓ వీడియోను రూపొందించి, దాన్ని ఇటీవల షేర్ చేసింది ఇరా.
ఆ వీడియోలో ఇరా, నూపుర్ ఎంత గాఢ ప్రేమలో మునిగిపోయి ఉన్నారో స్పష్టంగా తెలుస్తోంది. పార్టీల్లో, క్యాంపుల్లో, బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో, పర్వతారోహణలో, ఫిజికల్ ట్రైనింగ్‌లో, స్విమ్మింగ్ పూల్‌లో.. ఇలా అనేక యాక్టివిటీస్‌లో ఆ ఇద్దరూ చాలా క్లోజ్‌గా మూవ్ అవుతూ కనిపిస్తున్నారు. ఆ వీడియోను షేర్ చేసిన ఇరా, “You’re my anchor. #love #dreamboy #hashtags feel stupid. I love you soo much, cutie! (నువ్వు నా ప్రాణాధారం. నిన్నెంతగానో ప్రేమిస్తున్నా క్యూటీ)" అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది.
కొంతకాలంగా ప్రేమలో తడిసిముద్దవుతున్న ఇరా, నూపర్.. తమ మధ్య అనుబంధం విషయంలో ఓపెన్‌గా ఉంటూ, ఏమాత్రం సంకోచం లేకుండా తమ ప్రేమన సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేస్తూ వస్తున్నారు. తాజాగా షేర్ చేసిన వీడియోలో స్విమ్మింగ్ పూల్‌లో నూపుర్‌ను గాలికూడా చొరబడకూడదన్నంత గాఢంగా పెనవేసుకుపోయి కనిపిస్తోంది ఇరా. ఆ ఇద్దరి ప్రేమకు ఆమిర్ ఆశీర్వాదాలు ఉన్నాయి కూడా.
వర్క్ విషయానికి వస్తే.. ఇరా ఇటీవలే అగత్సు ఫౌండేషన్‌ను నెలకొల్పింది. ప్రస్తుత అసాధారణ పరిస్థితుల్లో ప్రజలకు మానసిక ఆరోగ్యాన్ని ఇచ్చేందుకు ఈ ఫౌండేషన్ ద్వారా ఆమె కృషి చేస్తోంది.