English | Telugu
అజయ్ దేవ్‌గణ్ కొత్త బంగళా ఖరీదు.. అక్షరాలా 60 కోట్లు!
Updated : Jun 2, 2021
బాలీవుడ్‌లోని టాప్ స్టార్స్‌లో, రిచ్చెస్ట్ యాక్టర్స్‌లో అజయ్ దేవ్‌గణ్ ఒకరు. 1991లో రిలీజైన బ్లాక్‌బస్టర్ మూవీ ఫూల్ ఔర్ కాంటేతో హీరో ఎంట్రీ ఇచ్చిన అజయ్.. ఈ మూడు దశాబ్దాల కెరీర్‌లో ఎన్నో సూపర్‌హిట్ సినిమాల్లో నటించాడు. ఫోర్బ్స్ ఇండియా 2019 సెలబ్రిటీ 100 లిస్ట్‌లో 12వ స్థానంలో నిలిచాడు. ఆయన వార్షికాదాయం రూ. 94 కోట్లుగా ఫోర్బ్స్ తెలిపింది. అంతటి ఆదాయం ఉండటం వల్ల ఆయన లైఫ్‌స్టైల్ కూడా దానికి తగ్గట్లే విలాసవంతంగా ఉంటుందని ఈజీగా ఊహించవచ్చు. ఖరీదైన బంగళాలు, విలాసవంతమైన కార్లు ఆయన సొంతం.
లేటెస్ట్‌గా, ముంబైలోని పాష్ ఏరియా జుహులో రూ. 60 కోట్ల ఖరీదైన కొత్త బంగళాను అజయ్ కొన్నట్లు ఆన్‌లైన్‌లో ప్రచారంలోకి వచ్చింది. అలియా భట్, జాన్వీ కపూర్, హృతిక్ రోషన్, అమితాబ్ బచ్చన్ ఇళ్లకు దగ్గర్లోనే ఈ బంగళా ఉంటుందట. మీడియా రిపోర్టుల ప్రకారం 590 చదరపు గజాల విస్తీర్ణంతో సువిశాలంగా ఉండే బిల్డింగ్ జుహులోని కాపోల్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్‌లో ఉంది. అజయ్ ప్రస్తుతం ఉంటున్న ఇల్లు 'శక్తి'కి ఇది మరీ ఎక్కువ దూరమేమీ కాదు. 'శక్తి'లోనే ఆయన భార్య కాజోల్, పిల్లలు నైసా, యుగ్‌తో ఆయన నివాసం ఉంటున్నాడు.
తొలిసారిగా ఆయన 'ఆర్ఆర్ఆర్' మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాలో ఆయన హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లకు యుద్ధవిద్యలు నేర్పే గురువు పాత్రలో కనిపించనున్నారు. ఆమధ్య విడుదలైన ఆయన క్యారెక్టర్ లుక్‌కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. బాలీవుడ్‌లో 'మైదాన్', 'థాంక్ గాడ్', 'మేడే' మూవీస్ చేస్తున్నాడు అజయ్. 'భుజ్' మూవీ నేరుగా డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో రిలీజ్ కానున్నది.