English | Telugu
వెల్కమ్ 3 రిలీజ్ అయ్యేది అప్పుడే!
Updated : Sep 10, 2023
జియో స్టూడియోస్ అఫిషియల్‌గా వెల్కమ్ 3 రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేసింది. .అనీజ్ బజ్మి తెరకెక్కించిన సినిమా వెల్కమ్. 2007లో విడుదలైంది. ఈ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిన వెల్కమ్ బ్యాక్ కూడా చాలా పెద్ద హిట్ అయింది. ఇప్పుడు వెల్కమ్ 3కి వెల్కమ్ టు ద జంగిల్ అని ఫుల్ నేమ్ పెట్టారు. ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని అక్షయ్‌కుమార్ ఓ ప్రోమో రిలీజ్ చేసి అనౌన్స్ చేశారు. రవీనా టాండన్, సంజయ్ దత్, సునీల్ శెట్టి, పరేష్ రావల్, దిశా పటాని కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు.
వచ్చే ఏడాది డిసెంబర్ 20న విడుదల కానుంది వెల్కమ్ 3. ఈ విషయాన్ని చెబుతూ వెల్కమ్ టు ద జంగిల్. ఇట్ విల్ బి ఎ డబుల్ సెలబ్రేషన్ అని అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ సినిమాను జ్యోతి దేశ్‌పాండే, ఫిరోజ్ నదియడ్‌వాలా నిర్మిస్తున్నారు. అహ్మద్ ఖాన్ తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమా అఫిషియల్ అనౌన్స్ మెంట్ రాగానే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేవు. ``వెల్కమ్ సినిమా జస్ట్ సినిమా కాదు. అదో ఎమోషన్. గ్రాండ్ సినిమా. స్టార్ కాస్ట్ నుంచి ప్రతిదీ గుర్తుండిపోయింది. ఈ సినిమాను దర్శకుడు కలగాపులగం చేయకూడదనే కోరుకుంటున్నాం`` అంటూ రకరకాల పోస్టులు కనిపిస్తున్నాయి. అక్షయ్‌కుమార్‌కి ఈ మూవీ మాసివ్ కంబ్యాక్ అవుతుందనే మాటలు కూడా వినిపిస్తున్నాయి.
అక్షయ్‌కుమార్‌కి వెల్కమ్ టు ద జంగిల్ పేరుతో పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. గత కొన్నాళ్లుగా సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు అక్షయ్‌కుమార్. ఆయన నటించిన ఓ మై గాడ్ 2 కి మంచి స్పందన వచ్చింది. బాక్సాఫీస్ దగ్గర 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసి డీసెంట్ హిట్ అనే పేరు తెచ్చుకుంది ఓమై గాడ్ 2.
