English | Telugu
బ్రహ్మాస్త్ర.. ఫ్యాన్స్ కి ఫుల్ మీల్సే మరి!
Updated : Sep 10, 2023
రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ నటించిన సినిమా బ్రహ్మాస్త్ర పార్ట్ ఒన్ శివ విడుదలై ఏడాది పూర్తయింది. గతే డాది సెప్టెంబర్ 9న విడుదలైంది బ్రహ్మాస్త్ర పార్ట్ ఒన్. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు అయాన్ ముఖర్జీ సోషల్ మీడియాలో ఈ విషయాన్ని చెబుతూ ఎర్లీ ఆర్ట్ వర్క్ ని పంచుకున్నారు. నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ ది బ్రహ్మాస్త్ర జర్నీ సూన్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. డెవలప్‌మెంట్ ఇన్ ప్రోగ్రెస్ అంటూ సెకండ్ అండ్ థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్స్ గురించి కూడా చాలా విషయాలను పంచుకున్నారు. ఆయన పంచుకున్న అప్‌డేట్స్ చూసి ఫ్యాన్స్ ఆ స్ట్రక్ అయ్యారు.
అయాన్ ముఖర్జీ రివీల్ చేసిన వాటిలో బ్రహ్మాస్త్ర పార్ట్ 2 దేవ్‌కి సంబంధించిన ఎర్లీ ఆర్ట్ వర్క్ ఉంది. ``గత కొన్ని నెలలుగా బ్రహ్మాస్త్ర పార్ట్ 2 అండ్ 3 కాన్సెప్ట్, ఆర్ట్ వర్క్ పరంగా పనిచేస్తూనే ఉన్నాను. మాకు స్ఫూర్తి పంచిన కొన్ని కీ ఇమేజెస్‌ని మీతో పంచుకోవాలని అనిపించింది. అందుకే ఈ స్పెషల్ డే రోజు మీతో పంచుకుంటున్నాను`` అని రాసుకొచ్చారు.
అయాన్ పోస్ట్ చూడగానే ఫ్యాన్స్ లో ఉత్సాహం పెల్లుబికింది. ``ఈగర్లీ వెయిటింగ్ ఫర్ పార్ట్ 2 అండ్ పార్ట్ 3` అంటూ పలువురు పోస్టులు పెట్టారు. ఆర్ట్ వర్క్ ప్రామిసింగ్‌గా ఉందంటూ ఇంకొందరు అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు. ఇట్స్ గోన్న బీ ఇన్‌సేన్ అంటూ యూత్ పెట్టిన పోస్టులు తెగ వైరల్ అవుతున్నాయి. బ్రహ్మాస్త్ర 2 ఇప్పుడప్పుడే ఉండదనుకున్నవారికి అయాన్ పెట్టిన పోస్ట్ సరికొత్త సమాచారాన్నయితే చేరవేసింది.
అయాన్ ముఖర్జీతో పాటు కరణ్ జోహార్ కూడా బ్రహ్మాస్త్ర ఒన్ ఇయర్‌ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఒన్ ఎక్స్ పీరియన్స్, ఒన్ జర్నీ, ఒన్ స్టోరీ అంటూ బిగ్ స్క్రీన్ మీద మేజిక్ జరిగిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. బ్రహ్మాస్త్ర ఫస్ట్ పార్టులో అమితాబ్ బచ్చన్, మౌనీరాయ్ కీలక పాత్రల్లో నటించారు. షారుఖ్, నాగార్జున స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చారు.
