English | Telugu

పూర్తి కావ‌చ్చిన హృతిక్‌రోష‌న్ - దీపిక ప‌దుకోన్ ఫైట‌ర్ షూటింగ్

పూర్తి కావ‌చ్చిన హృతిక్‌రోష‌న్ - దీపిక ప‌దుకోన్ ఫైట‌ర్ షూటింగ్

హృతిక్ రోష‌న్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న సినిమా ఫైట‌ర్‌. ఈ సినిమాలో దీపికా ప‌దుకోన్ నాయిక‌గా న‌టిస్తున్నారు. అనిల్ క‌పూర్ కీ రోల్ చేస్తున్నారు. ఈ ఏడాది ప‌ఠాన్ విడుద‌లైన అదే రోజున వ‌చ్చే ఏడాది ఫైట‌ర్ విడుద‌ల కానుంది. 2024 జ‌న‌వ‌రి 25న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. ఈ సినిమా ఫైన‌ల్ షెడ్యూల్ షూటింగ్ జ‌రుగుతోంది. మ‌రి కొన్నాళ్ల‌ల్లో మొత్తం షూటింగ్ పూర్త‌వుతుంది. అక్టోబ‌ర్‌లోపు అన్నీ ప‌నుల్ని కంప్లీట్ చేసేయాల‌ని చూస్తున్నారు డైర‌క్ట‌ర్ సిద్ధార్థ్ ఆనంద్‌. క‌ర‌ణ్ సింగ్ గ్రోవ‌ర్‌, అక్ష‌య్ ఒబెరాయ్‌, సంజీద షేక్, త‌ల‌త్ అజీజ్ కీ రోల్స్ చేస్తున్నారు. విశాల్ శేఖ‌ర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఏరియ‌ల్ యాక్ష‌న్ సినిమా జోన‌ర్‌లో తెర‌కెక్కిస్తున్నారు ఫైట‌ర్‌ని. ప్ర‌స్తుతం ముంబైలోని య‌ష్ రాజ్ స్టూడియోస్‌లో ఫైట‌ర్‌కి సంబంధించిన కీ స‌న్నివేశాల‌ను తెర‌కెక్కిస్తున్నారు.  హృతిక్ రోష‌న్‌, అనిల్ క‌పూర్‌, దీపిక ప‌దుకోన్ ఈ సీక్వెన్స్ లో న‌టిస్తున్నారు. హృతిక్ రోష‌న్‌, దీపిక ప‌దుకోన్ ఇందులో పైల‌ట్లుగా క‌నిపిస్తారు. అనిల్ క‌పూర్ వారిద్ద‌రికీ మెంట‌ర్‌గా న‌టిస్తున్నారు.

ది నైట్ మేనేజ‌ర్ స‌క్సెస్ అయిన ఆనందంలో ఉన్నారు అనిల్ క‌పూర్‌. ప‌ఠాన్‌, జ‌వాన్‌... ఈ ఏడాది బ్యాక్ టు బ్యాక్ రెండు హిట్స్ తో హ్యాపీగా ఉన్నారు దీపికా ప‌దుకోన్‌. హృతిక్ రోష‌న్ మాత్రం ఫైట‌ర్ కోసం ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నారు. అక్టోబ‌ర్ సెకండాఫ్ లో ఆయ‌న వార్‌2 షూటింగ్ లో పాల్గొంటారు. ఆ స‌మ‌యంలోనే జూనియ‌ర్ ఎన్టీఆర్ కూడా వార్ 2 సినిమా షూటింగ్‌కి హాజ‌ర‌వుతారు. వార్ 2 కోసం హృతిక్‌, తార‌క్ ఇద్ద‌రూ ఫిజిక్ ప‌రంగా కొత్త‌గా క‌నిపించేలా ట్రై చేస్తున్నారు. వార్‌2కి ఇద్ద‌రూ మేకోవ‌ర్ అవుతార‌న్న‌ది బాలీవుడ్ న్యూస్‌.