English | Telugu

టైగ‌ర్ 3కి, క్రిస్ట‌ఫ‌ర్ నోలాన్‌తో క‌నెక్ష‌న్ ఏంటి?

స‌ల్మాన్ ఖాన్‌, క‌త్రినా కైఫ్ జంట‌గా న‌టిస్తున్న సినిమా టైగ‌ర్ 3. 2023లో విడుద‌ల‌కు రెడీ అవుతున్న సినిమాల్లో ఇది కూడా ఒక‌టి. ఈ సినిమాకు క్రిస్ట‌ఫ‌ర్ నోలెన్ క‌నెన్ష‌న్ ఉందంటోంది బాలీవుడ్ మీడియా. మ‌నీష్ శ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సినిమా టైగ‌ర్ 3. ఈ సినిమా ప్రీవియ‌స్ మూవీస్ రెండూ చాలా పెద్ద హిట్ అయ్యాయి. టైగ‌ర్‌, జోయా మ్యాజిక్‌కి మ‌ళ్లీ ఆన్‌స్క్రీన్ చూడటానికి ఎగ్జ‌యిటింగ్‌గా ఉన్నారు జ‌నాలు. ఈ సినిమా కోసం టాప్ హాలీవుడ్ యాక్ష‌న్ కో ఆర్డినేట‌ర్ క్రిస్ బ‌ర్నెస్‌ని హ‌య‌ర్ చేసుకున్నార‌ట‌. ఈయ‌న గ‌తంలో ఎవెంజ‌ర్స్ ఎండ్‌గేమ్‌, ఒప్పెన్ హైమ‌ర్‌కు ప‌నిచేశారు. క్రిస్ట‌ఫ‌ర్ నోలెన్ క‌లెక్ష‌న్ ఇలా వ‌చ్చింది టైగ‌ర్‌3కి.
దీనిక‌న్నా ముందే మార్క్ సిజాక్‌ని హ‌య‌ర్ చేసుకుంది ఈ సినిమా టీమ్‌. ఇప్పుడు నెక్స్ట్ యాక్ష‌న్ ఎపిసోడ్ కోసం క్రిస్ట‌ఫ‌ర్ నోలెన్ సెల‌క్ష‌న్‌కి ఓటు వేసింది. ``టైగ‌ర్‌3 యాక్ష‌న్ డైర‌క్ట‌ర్ల గురించి ఇప్ప‌టికే బాలీవుడ్‌లో మంచి బ‌జ్ క్రియేట్ అయింది. నిర్మాత ఆదిత్య చోప్రా, ద‌ర్శ‌కుడు మ‌నీష్ శ‌ర్మ ఈ సినిమా బిజినెస్ మీద మంచి హోప్స్ పెట్టుకున్నారు. ఆడియ‌న్స్‌కి అద్భుత‌మైన ఎక్స్ పీరియ‌న్స్ ఇవ్వాల‌ని డిసైడ్ అయ్యారు. అందుకే ఈ సినిమా స్కేల్ కూడా మ‌రో రేంజ్‌లో ఉంది`` అని అంటున్నారు బాలీవుడ్ క్రిటిక్స్.
ఈ చిత్రంలో ఇమ్రాన్ హ‌ష్మి కీ రోల్ చేస్తున్నారు. క‌త్రినా జోయా కేర‌క్ట‌ర్‌లో మ‌ళ్లీ న‌టిస్తున్నారు. దివాళికి విడుద‌ల కానుంది ఈ సినిమా. ``టైగ‌ర్ 3 ఫ‌స్ట్ క‌ట్ లాక్ అయింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ముఖ్యంగా వీయ‌ఫ్ ఎక్స్ ప‌నులు ఫుల్ స్వింగ్‌లో జ‌రుగుతున్నాయి. గ్రాండెస్ట్ యాక్ష‌న్ ఫిల్మ్ ఇన్ ఇండియ‌న్ సినిమా అనే పేరు తెచ్చుకోవాల‌ని టీమ్ క‌ష్ట‌ప‌డుతోంది`` అని అన్నారు మేక‌ర్స్.