English | Telugu
అక్షయ్ రెమ్యూనరేషన్.. నిర్మాత క్లారిటీ
Updated : Aug 19, 2023
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, పంకజ్ త్రిపాఠి కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ఓ మైగాడ్ 2. ఈ సినిమా విడుదల ముందు, విడుదల తర్వాత వివాదాలు ఏర్పడ్డాయి. అయినప్పటికీ సినిమా రిలీజై మంచి ఆదరణను పొందుతోంది. తాజాగా ఈ సినిమాపై సోషల్ మీడియాలో వచ్చిన కొత్త రూమర్.. అక్షయ్ కుమార్ రెమ్యూనరేషన్ గురించి. ఓ మైగాడ్ 2 సినిమా కోసం అక్షయ్ కోట్లలో పారితోషం తీసుకున్నారంటూ న్యూస్ నెట్టింట చక్కర్లు కొట్టింది. ఈ నేపథ్యంలో నిర్మాతల్లో ఒకరైన అజిత్ ఈ విషయంలో క్లారిటీ ఇచ్చేశారు.
‘‘అక్షయ్ కుమార్‌గారి రెమ్యూనరేషన్ విషయంలో నెట్టింట చాలా వార్తలు వచ్చాయి. అలాంటి వార్తలు ఎలా వస్తున్నాయనేది తెలియటం లేదు. ఆయన మా నుంచి భారీ పారితోషకం తీసుకున్నారంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదు. అక్షయ్‌కుమార్ మా సినిమాలో నటించటానికి ఒక రూపాయి రెమ్యూనరేషన్ తీసుకోలేదు. మరీ ముఖ్యంగా ఆయన మాకు ఆర్థిక సాయం చేయటంతో పాటు కొన్ని విషయాల్లో తన అమూల్యమైన సలహాలను అందించారు. అక్షయ్‌గారితో మాకు ఎప్పటి నుంచో మంచి స్నేహం ఉంది. ఇలాంటి ఎక్స్‌పెరిమెంట్స్ సినిమాలు చేయటంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు’’ అని తెలిపారు ప్రొడ్యూసర్.
చిన్న పిలల్లకు లైంగిక విద్య ఆవశ్యకతను తెలియజేసే పాయింట్‌తో ఓ మైగాడ్ సినిమాను రూపొందించారు డైరెక్టర్ అమిత్ రాయ్. ఇందులో అక్షయ్ శివుడిగా నటిస్తే పంకజ్ త్రిపాఠి భక్తుడిగా నటించారు. యామీ గౌతమ్ లాయర్ పాత్రలో కనిపించారు.