English | Telugu
ఆదిత్యరాయ్‌తో అనన్య... వర్కవుట్ అవుతుందా?
Updated : Aug 18, 2023
ఆదిత్యరాయ్ కపూర్‌కీ, అనన్య పాండేకి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ అంటూ కోడైకూస్తోంది బాలీవుడ్ మీడియా. ఇప్పటిదాకా ఈ జంట ఈ ప్రేమ వ్యవహారం గురించి ఏమీ మాట్లాడలేదు. అయితే రీసెంట్‌గా తన రూమర్డ్ బోయ్‌ఫ్రెండ్ గురించి నోరు విప్పారు అనన్య. అది కూడా ఆదిత్యరాయ్‌కపూర్‌తో కలిసి వర్క్ చేసే విషయం గురించి స్పందించారు ఈ బ్యూటీ.
గతేడాది కృతి సనన్ ఇచ్చిన దివాళీ బ్యాష్‌లో ఆదిత్య, అనన్య మాట్లాడుకున్న తీరు చూసి అందరూ వారిద్దరికీ మధ్య ఏదో జరుగుతుందని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఆ తర్వాత స్పెయిన్‌లో ఆర్కిటిక్ మంకీస్ కి వెళ్లినప్పుడు, లండన్‌లో సమయం గడిపినప్పుడు, కలిసి సినిమాలకు వెళ్లినప్పుడు, వెకేషన్లకు వెళ్లినప్పుడు ఈ మాటలు చిలికి చిలికి గాలివానయ్యాయి.
సరిగ్గా ఇదే సమయంలో ఫ్యూచర్‌లో ఆదిత్యరాయ్ కపూర్‌తో కలిసి పనిచేస్తారా అనే ప్రశ్న ఎదురైంది అనన్య పాండేకి. దీనికి ఆమె స్పందిస్తూ ``నాకు తెలియదు. ఒకవేళ మా ఇద్దరి కోసం ఎవరైనా మంచి స్క్రిప్ట్ రాస్తారేమో చూడాలి. నేను ఇంతకు ముందు కార్తిక్‌తో పనిచేశాను. కానీ ఆదితో నేను ఇప్పటిదాకా పనిచేయలేదు. ఒకవేళ చేయాల్సి వస్తే మాత్రం గ్రేట్ ఫన్ అవుతుంది`` అని అన్నారు. తనకు పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలని ఉందని, కానీ తానింకా చిన్నపిల్లనేనని, ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదనీ అన్నారు.
ఇటీవల ఆదిత్యరాయ్ కపూర్, అనన్య కలిసి బార్బీ సినిమా చూశారు. ప్రస్తుతం అనన్య డ్రీమ్ గర్ల్ 2 ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ఈ నెల 25న విడుదల కానుంది డ్రీమ్ గర్ల్ 2. ఆదిత్య రాయ్ కపూర్‌కి ఇటీవల నైట్ మేనేజర్ విడుదలైంది. ప్రస్తుతం అతను అనురాగ్ బసు సినిమా మెట్రో ఇన్ డినోలో నటిస్తున్నారు.