English | Telugu
ఈసారి సల్మాన్‌ఖాన్‌కి షారూఖ్ సపోర్ట్
Updated : Jul 25, 2023
కెరీర్ స్టార్టింగ్‌లో బాలీవుడ్ బడా స్టార్స్ సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్ మంచి స్నేహితులు. ఇద్దరూ కలిసి కరణ్ అర్జున్ వంటి సినిమాలోనూ నటించారు. తర్వాత మనస్పర్దలతో ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చేసింది. అయితే ఈ మధ్య మళ్లీ ఇద్దరూ కలిసిపోయారు. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ పఠాన్ సినిమా. ఈ ఏడాది జనవరిలో వచ్చిన షారూఖ్ ఖాన్ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఆ సినిమాలో సల్మాన్ ఖాన్ గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు. అలాగే సల్మాన్ ఖాన్ యాక్షన్ మూవీ టైగర్ 3లో షారూఖ్ అలరించబోతున్నారనే సంగతి తెలిసిందే. ఇప్పుడు వారిద్దరూ కలిసి యష్ రాజ్ ఫిలింస్ యూనివర్స్‌లో సినిమా చేయబోతున్నారు.
ఈ నేపథ్యంలో షారూఖ్ ఖాన్ మరోసారి సల్మాన్ ఖాన్‌కి తన స్నేహ హస్తాన్ని అందించబోతున్నారు. వివరాల్లోకి వెళితే, సెప్టెంబర్ 7న షారూఖ్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సినిమా ఇంటర్వెల్‌లో సల్మాన్ ఖాన్ టీజర్‌ను మేకర్స్ ఎటాచ్ చేయబోతున్నారు. ఈ సినిమాకు షారూఖ్ ఖానే నిర్మాత కూడా. అలా మరోసారి కింగ్ ఖాన్.. తన ఫ్రెండ్‌కి సపోర్ట్ చేస్తున్నారు. టైగర్ 3 సినిమా విషయానికి వస్తే యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై మనీష్ శర్మ దర్శకత్వంలో ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. కత్రినా కైఫ్ హీరోయిన్‌గా మెప్పించనుంది. దీపావళి సందర్భంగా ఈ చిత్రం నవంబర్ 10న గ్రాండ్ రిలీజ్ కానుంది.
మరో వైపు యష్ రాజ్ ఫిల్మ్స్ యూనివర్స్‌లో షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ నటించబోయే సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఈ సినిమాపై ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫ్యాన్స్, ప్రేక్షకులు, ట్రేడ్ వర్గాలు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.