English | Telugu

సింగం థ‌ర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ ప్రోగ్రెస్‌!

సింగం పేరు విన‌గానే యాక్ష‌న్ మూవీ ల‌వ‌ర్స్ లో అదో మాదిరి ఇష్టం బ‌య‌ట‌కు క‌నిపిస్తుంటుంది. లేటెస్ట్ గా సింగం సినిమా సీరీస్‌లో థ‌ర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్‌కి సంబంధించిన అప్‌డేట్ వ‌చ్చేసింది. అజ‌య్ దేవ్‌గ‌ణ్ న‌టిస్తున్న సినిమా ఇది. సింగం ఫ్రాంచైజీలో మోస్ట్ ఎక్స్ పెక్టెడ్ మూవీగా పేరు తెచ్చుకుంది. ప్ర‌స్తుతం సింగం థ‌ర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్‌కి సంబంధించి ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయ‌ని అన్నారు డైర‌క్ట‌ర్ రోహిత్ శెట్టి.

ఆయ‌న తెర‌కెక్కించిన స‌ర్క‌స్ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర స‌రిగా ఆడ‌లేదు. అందుకే స‌ర్క‌స్ సినిమా జ్ఞాప‌కాల‌ను దాటుకుని బ‌య‌ట‌కు వ‌చ్చి ఆయ‌న సింగం సీరీస్ మీద ఫోక‌స్ చేస్తున్నారు. అంత‌కన్నా ముందు ఆయ‌న తెర‌కెక్కించిన వెబ్ సీరీస్ ఇండియ‌న్ పోలీస్ ఫోర్స్ గురించి ఆస‌క్తి చూపిస్తున్నారు రోహిత్ శెట్టి అభిమానులు.

సిద్ధార్థ్ మ‌ల్హోత్రా కాప్ రోల్‌లో న‌టించిన వెబ్ సీరీస్ ఇండియ‌న్ పోలీస్ ఫోర్స్. ఆల్రెడీ రోహిత్ శెట్టి కాప్ యూనివ‌ర్శ్‌కి ఓ క్రేజ్ ఉంది. అందుకే ఇప్పుడు ఇండియ‌న్ పోలీస్ ఫోర్స్ లో కాప్ కేర‌క్ట‌ర్ మీద కూడా గ‌ట్టిగానే ఫోక‌స్ చేస్తున్నారు అభిమానులు. గ‌తేడాదే విడుద‌ల కావాల్సిన సీరీస్ ఇది. ``సిద్ధార్థ్‌తో చేసిన ఈ కాప్ రోల్‌ని వెబ్ సీరీస్ కోసం అన్న‌ట్టు డిజైన్ చేయ‌లేదు. ఓ సినిమాకు ఎంత కేర్ తీసుకుంటామో, అంతే కేర్ తీసుకుని చేశాం. ప్రేక్ష‌కుల‌కు న‌చ్చుతుంద‌ని భావిస్తున్నాను. లార్జ‌ర్ దేన్ లైఫ్ ఎక్స్ పీరియ‌న్స్ ఇస్తుంది ఈ సీరీస్‌`` అని అన్నారు. సింగం3 గురించి మాట్లాడుతూ ``ప్ర‌స్తుతం టీమ్ ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో ఉంది. హార్ట్ అండ్ సోల్ పెట్టి ప‌నిచేస్తున్నారు. త్రీక్వెల్ ఇంకా బిగ్గ‌ర్‌గా, బెట‌ర్‌గా ఉంటుంది. 2011లో ఫ‌స్ట్ పార్ట్, 2014లో సెకండ్ పార్ట్ విడుద‌ల చేశాం. థ‌ర్డ్ పార్ట్ వ‌చ్చే ఏడాది ఉంటుంది`` అని అన్నారు.