English | Telugu
‘జవాన్’లో భయపెట్టబోతున్న విజయ్ సేతుపతి
Updated : Jul 25, 2023
కోలీవుడ్ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి లేటెస్ట్ మూవీ `జవాన్`. క్రేజీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉండే విజయ్ సేతుపతి.. షారూఖ్ ఖాన్‌ని ఢీ కొట్టబోతున్నాడీ చిత్రంలో. హీరో పాత్రకు ధీటుగా విలన్ పాత్రను డిజైన్ చేశారట డైరెక్టర్ అట్లీ. రీసెంట్‌గా వచ్చిన జవాన్ ప్రివ్యూలో విజయ్ సేతుపతిని కొన్ని క్షణాల పాటు మాత్రమే చూపించారు. దీంతో ఈయన రోల్ ఎలా ఉంటుందనేది అందరిలోనూ ఆసక్తిని రేపుతోన్న విషయం. అయితే తాజాగా విజయ్ సేతుపతి పాత్రకు సంబంధించిన అప్‌డేట్‌ను ఇవ్వటానికి మేకర్స్ రెడీ అయిపోయారు. తను మిమ్మల్ని చాలా దగ్గర నుంచి చూస్తున్నాడు అంటూ విజయ్ సేతుపతి కన్ను ఉన్న పోస్టర్‌ను రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్మెంట్ పోస్ట్ చేసింది.
హీరోగా విజయ్ సేతుపతి ఎలా మెప్పిస్తాడో.. విలన్‌గా అంత కంటే ఎక్కువేనని చెప్పాలి. మరి జవాన్‌లో అట్లీ తన పాత్రను ఎలా డిజైన్ చేశాడా? అని అందరూ ఇంట్రెస్ట్‌గా ఎదురు చూస్తున్నారు. మరి మక్కల్ సెల్వన్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తారా? లేక గ్లింప్స్ లాగా ఏమైనా రిలీజ్ చేస్తారేమో చూడాలి. పఠాన్ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత షారూఖ్ ఖాన్ చేస్తోన్న జవాన్ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. సినిమా తొలి రోజున బాక్సాఫీస్ వద్ద ఏ మేరకు కలెక్ట్ చేస్తుందనేది ఇప్పుడు డిస్కషన్ పాయింట్‌గా మారింది. అంతే కాకుండా జవాన్‌తో షారూఖ్ సౌత్ మార్కెట్‌పై కన్నేశాడు. అందుకనే డైరెక్టర్‌గా అట్లీతో పాటు నయనతార, విజయ్ సేతుపతి, ప్రియమణి వంటి సౌత్ నటీనటులు, అనిరుద్ వంటి టెక్నీషియన్‌ను తీసుకున్నారు.
రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్మెంట్ సమర్పణలో.. అట్లీ దర్శకత్వంలో గౌరీ ఖాన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గౌవర్ వర్మ ఈ సినిమాకు సహ నిర్మాత. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 7న భారీ స్థాయిలో రిలీజ్ అవుతుంది.