English | Telugu

భ‌గ‌త్‌సింగ్ సీక్రెట్స్ చెప్పిన బాలీవుడ్ హీరో!

భ‌గ‌త్‌సింగ్ రోల్‌లో న‌టించ‌డం గురించి నోరువిప్పారు రాజ్‌కుమార్ రావు. ఆ సినిమా త‌న‌కు ఎంత కీల‌క‌మో వివ‌రించారు. సుప్రీమ్‌లీ టాలెంటెడ్ ఆర్టిస్టుల్లో రాజ్‌కుమార్ రావు ఒక‌రు. బ్రిల్లియంట్ పెర్ఫార్మర్ అని పేరు తెచ్చుకున్నారు. నేష‌న‌ల్ అవార్డు తెచ్చుకున్న రాజ్‌కుమార్ రావు త‌న డ్రీమ్ రోల్ భ‌గ‌త్‌సింగ్ గురించి చాలా విష‌యాలు చెప్పుకొచ్చారు.
ఆయ‌న మాట్లాడుతూ ``భ‌గ‌త్ సింగ్ రోల్‌లో కెమెరా ముందు నిలుచోవ‌డం అదృష్టం. భ‌గ‌త్‌సింగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయ‌న జ‌ర్నీని అమితంగా ఇష్ట‌ప‌డ‌తాను. ఇప్ప‌టిదాకా ఆయ‌న గురించి తెలుసుకున్న‌దంతా చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే ఆయ‌న జీవితంతో వ‌చ్చే సినిమా మ‌రింత డిఫ‌రెంట్‌గా ఉంటుంది. ఆ పాత్ర‌లో చేయ‌డం నా క‌ల నెర‌వేరిన‌ట్టు`` అని అన్నారు.
ప్ర‌స్తుతం స్త్రీ2లో న‌టిస్తున్నారు రాజ్‌కుమార్ రావు. ఈ సినిమాలోనే శ్ర‌ద్ధా క‌పూర్ నాయిక‌గా న‌టిస్తున్నారు. ఇటీవ‌ల ల‌క్నోలో కీ షెడ్యూల్ జ‌రిగింది. హార‌ర్ థ్రిల్ల‌ర్ సినిమాగా తెర‌కెక్కుతోంది స్త్రీ 2. ఈ సినిమాతో పాటు గ‌న్స్ అండ్ గులాబ్స్ లోనూ న‌టించారు రాజ్‌కుమార్ రావు. ఇందులో ఆయ‌న స్మాల్ టౌన్‌లో మెకానిక్‌గా క‌నిపించారు.