English | Telugu
వాసన్ బాలా నెక్స్ట్ మూవీలో ఆలియా!
Updated : Aug 18, 2023
ఆలియా నెక్స్ట్ సినిమా ఏంటనేది వెయ్యి డాలర్ల ప్రశ్న. దీనికి సమాధానం ఇచ్చేశారు వాసన్ బాలా సన్నిహితులు. గన్స్ అండ్ గులాబ్స్ స్టార్ గుల్షన్ దేవయ్య మాట్లాడుతూ ఈ విషయం గురించి కన్‌ఫర్మేషన్ ఇచ్చేశారు. గన్స్ అండ్ గులాబ్స్ నెట్‌ఫ్లిక్స్ లో శుక్రవారం విడుదలైంది. కామెడీ థ్రిల్లర్ ఇది. 1990ల బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. ఇందులో దుల్కర్ సల్మాన్, రాజ్‌కుమార్ రావు, గుల్షన్ దేవయ్య, ఆదర్శ్ గౌరవ్ కీలక పాత్రల్లో నటించారు. రాజ్ అండ్ డీకే సీరీస్ ఇది. ఈ సీరీస్‌తో పాటు చాలా విషయాలను గురించి మాట్లాడారు గుల్షన్. ఆయన మాట్లాడుతూ ``నా ఫ్రెండ్, డైరక్టర్ వాసన్ బాలన్ నెక్స్ట్ సినిమా ఆలియాతో ఉండే అవకాశాలున్నాయి. అయితే దాని గురించి నాకు పూర్తి వివరాలు తెలియవు. ఆయన నెక్స్ట్ సినిమాకు ఆల్ ది బెస్ట్. నేను కూడా ఈ విషయాన్ని ఎక్కడో చూసినట్టు గుర్తు. అలా తెలిసిందే కానీ వాసన్ నాతో ఈ వివరాలేమీ డిస్కస్ చేయలేదు`` అని అన్నారు.
వాసన్ బాలా ప్రస్తుతం ఆలియా కోసం ఓ ప్రిసన్ బ్రేక్ స్టోరీని కుక్ చేస్తున్నారు. మర్ద్ కో దర్ద్ నహీ హోతా, మోనికా, ఓ మై డార్లింగ్ సినిమాల దర్శకుడిగా ఫేమ్ ఉంది వాసన్‌కి. ఆయన దర్శకత్వం వహిస్తున్న సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉంది. ఈ సినిమాకు ఇంకా పేరు పెట్టలేదు. ఆలియాకున్న అన్ని కమిట్‌మెంట్లూ పూర్తయితే, సెప్టెంబర్‌లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది.
గన్స్ అండ్ గులాబ్స్!
గన్స్ అండ్ గులాబ్స్ ట్రైలర్‌కి మంచి స్పందన వస్తోంది. బ్రిటిష్ సీరీస్ మిస్‌ఫిట్స్ ఆఫ్ ది వరల్డ్ ఆధారంగా తెరకెక్కింది గన్స్ అండ్ గులాబ్స్. రాజ్ కుమార్ రావు, దుల్కర్ సల్మాన్, గుల్షన్ దేవయ్య, ఆదర్శ్ గౌరవ్, రాజ్ అండ్ డీకే, సతీష్ కౌషిక్, పూజా గోర్, శ్రేయ ధన్వంతరి, అష్మిత కుందర్, గౌతమ్ శర్మ, విపిన్ శర్మ కీ రోల్స్ చేశారు.