Read more!

English | Telugu

ఓటమి ఎరుగని శక్తివంతమైన వీరుడు.. ‘వార్‌2’లో ఎన్టీఆర్‌ క్యారెక్టర్‌ ఇదే!

టాలీవుడ్‌లో హీరోలుగా రాణించినప్పటికీ ప్రతి హీరోకి బాలీవుడ్‌లో కూడా తన సత్తా చూపించాలని ఉంటుంది. అలా ఎంతో మంది హీరోలు బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. అయితే ఎవరూ అక్కడ నిలబడలేకపోయారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో నిర్మిస్తున్న సినిమాలన్నీ పాన్‌ ఇండియా మూవీస్‌గానే రిలీజ్‌ అవుతున్నాయి. ప్రతి సినిమా హిందీలో కూడా రిలీజ్‌ అవుతోంది. హీరోలకు అంతే పాపులారిటీ వస్తోంది. అయితే స్ట్రెయిట్‌ సినిమా చేసి బాలీవుడ్‌లోనూ జెండా పాతాలనేది మన హీరోల ఆలోచన. అందుకే ఎప్పటి నుంచో అలా ప్రయత్నిస్తూనే ఉన్నారు. తాజాగా ఎన్టీఆర్‌ కూడా ఓ ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. హృతిక్‌ రోషన్‌ హీరోగా అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘వార్‌2’ చిత్రంలో ఎన్టీఆర్‌ కూడా నటిస్తున్నాడు. దర్శకుడు అయాన్‌ ఇంట్రెస్ట్‌ వల్లే ఎన్టీఆర్‌ ‘వార్‌2’లో చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్‌ స్టార్ట్‌ అయి చాలా కాలమైంది. ఫస్ట్‌ షెడ్యూల్‌ పూర్తయింది. ఈ షెడ్యూల్‌లో హృతిక్‌ రోషన్‌కి సంబంధించిన సీన్స్‌ను చిత్రీకరించారు. ప్రస్తుతం ఎన్టీఆర్‌ ‘దేవర’ షూటింగ్‌లో ఉన్న కారణంగా అతని రాకకోసం ‘వార్‌2’ యూనిట్‌ ఎదురుచూస్తోంది. అందుకే రెండో షెడ్యూల్‌ను వాయిదా వేశారు. 

ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ క్యారెక్టర్‌ ఎలా ఉండబోతోంది అనే దానిపై గత కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తారక్‌ క్యారెక్టర్‌ నెగెటివ్‌ షేడ్స్‌లో ఉంటుందని కొందరు, ఈ సినిమాలో ఎన్టీఆర్‌ విలన్‌గా కనిపిస్తాడని కొందరు చెప్పుకుంటున్నారు. తాజా సమాచారం మేరకు హీరోకు, విలన్‌ మధ్యలో ఉండే థిన్‌ లైన్‌లాంటి క్యారెక్టర్‌ ఎన్టీఆర్‌ చేయబోతున్నారని తెలుస్తోంది. ధూమ్‌ సిరీస్‌లో హృతిక్‌ రోషన్‌, అమీర్‌ ఖాన్‌ అలాంటి క్యారెక్టర్సే చేశారు. ‘వార్‌2’లో ఎన్టీఆర్‌ క్యారెక్టర్‌ కూడా అలాగే ఉంటుందట. నెగెటివ్‌ షేడ్స్‌తో ఉన్నప్పటికీ ఓటమి ఎరుగని ఓ వీరుడి పాత్ర ఎన్టీఆర్‌ది అని తెలుస్తోంది.  అంతేకాదు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్‌ పాయిట్‌ సినిమాలో ఉంటుందని సమాచారం. ఇక ఎన్టీఆర్‌కి ఈ సినిమా తప్పకుండా ఒక స్టెప్‌ లాంటిది అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. ఈ సినిమాలో మరో ప్రత్యేకత ఏమిటంటే.. ఎన్టీఆర్‌, హృతిక్‌ రోషన్‌ కలిసి స్టెప్పులేస్తారట. ఎన్టీఆర్‌ ఎంత గొప్ప డాన్సరో మనకు తెలుసు. అలాగే హృతిక్‌ డాన్స్‌కి కూడా వీరాభిమానులు ఉన్నారు. మరి వీరిద్దరూ కలిసి ఒకేసారి డాన్స్‌ చేస్తూ కనిపిస్తే ఎలా ఉంటుంది? ‘వార్‌2’కి సంబంధించిన ఇలాంటి అప్‌డేట్స్‌ చూసిన తర్వాత ప్రేక్షకుల్లో, అభిమానుల్లో సినిమాపై క్రేజ్‌ మరింత పెరిగిపోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.