Read more!

English | Telugu

హృతిక్‌ రోషన్‌కి ఏమైంది.. యాక్సిడెంటా?.. వైరల్‌గా మారిన అతని పోస్ట్‌!

బాలీవుడ్‌ స్టార్‌ హీరో హృతిక్‌ రోషన్‌ తీవ్రంగా గాయపడ్డాడా.. నడవలేని స్థితిలో వీల్‌చైర్‌ను ఆశ్రయించాడా? ఇది ప్రస్తుతం సోషల్‌మీడియాలో చర్చగా మారింది. ఎందుకంటే హృతిక్‌ పెట్టిన ఓ పోస్ట్‌ ఈ చర్చలకు దారితీస్తోంది. హృతిక్‌ చేసిన పోస్ట్‌ అందర్నీ కలవరపెడుతోంది. అసలేం జరిగింది.. ఏదైనా యాక్సిడెంటా.. ఎక్కడ జరిగింది.. ఈ ప్రశ్నలు అందరిలోనూ తలెత్తుతున్నాయి. ఆ పోస్ట్‌లోని ఫోటోలు చూస్తే కాళ్లు, వెన్నెముక విరిగినట్లు తెలుస్తోంది. పోస్ట్‌లో అతను పేర్కొన్న విషయం మరింత విచిత్రంగా ఉంది. ‘మీలో ఎంతమందికి క్రచ్‌, వీల్‌చైర్‌పై ఉండాల్సిన అవసరం ఉంది.. గతంలో మీకెప్పుడైనా ఇలాంటి పరిస్థితి వచ్చిందా.. అప్పుడు మీరు ఎలా ఫీలయ్యారు?’ అంటూ ప్రశ్నించాడు. ఇది అభిమానులను మరీ గందరగోళానికి గురి చేస్తోంది. అసలేం జరిగింది ఒంటికి ఆ కట్లు ఏంటి.. ఈ ప్రమాదం ఎప్పుడు జరిగింది అంటూ వరుసగా ప్రశ్నలు కురిపిస్తున్నారు. 

అయితే హృతిక్‌ తాను గాయపడ్డ విషయం డైరెక్ట్‌గా చెప్పకుండా.. ఓ సుదీర్ఘమైన పోస్ట్‌ చేశాడు హృతిక్‌. ఇదే పోస్ట్‌లో తన తాతగారిని గుర్తు చేసుకుంటూ ‘నాకు బాగా గుర్తుంది.. మా తాత ఎయిర్‌పోర్ట్‌లో వీల్‌ చైర్‌పై కూర్చోవడానికి ససేమీరా ఒప్పుకోలేదు. ఎందుకంటే అది తనను తాను బలహీనమైన వాడినని గుర్తు చేస్తుంది’ అన్నారు. దానికి నేను ‘ఈ వీల్‌ చైర్‌ మీ గాయాన్ని నయం చేయడంలో సహాయపడుతుంది’ అని చెప్పాను అంటూ పాత రోజుల్ని మళ్లీ గుర్తు చేసుకున్నాడు హృతిక్‌. అయితే అతను పోస్ట్‌ చేసిన ఫోటోలతో ఏం చెప్పదలుచుకున్నాడు.. నిజంగానే యాక్సిడెంట్‌ జరిగిందా.. అయితే అసలు విషయం చెప్పకుండా ఆ పోస్ట్‌ ఎందుకు పెట్టినట్టు.. ఇలాంటి ప్రశ్నలతో అభిమానులు గందరగోళానికి గురవుతున్నారు.