Read more!

English | Telugu

మైండ్ బ్లోయింగ్ యాక్షన్ సీన్ తో 'వార్ 2' మొదలు పెట్టబోతున్న హృతిక్ రోషన్ 

'ఫైటర్' చిత్రం విడుదలైన నెలలోపే బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ తన తదుపరి చిత్రం కోసం కసరత్తులు మొదలు పెట్టారు. జనవరి 25న విడుదలైన 'ఫైటర్' చిత్రం థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత హృతిక్ నటించబోయే తదుపరి చిత్రం ఏదో కాదు.. ఫాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'వార్ 2'. రీసెంట్ ఇంటర్వ్యూలో సైతం హృతిక్ ఈ చిత్ర షూటింగ్ గురించి మాట్లాడారు. అతిత్వరలో వార్ 2 మొదలు కాబోతోంది. బహుశా నాకు ఊపిరి తీసుకునే టైం కూడా ఉండదేమో అని తెలిపారు. 

2019లో విడుదలైన 'వార్' చిత్రంలో హృతిక్ ఏజెంట్ కబీర్ పాత్రలో అదరగొట్టారు. హృతిక్, టైగర్ ష్రాఫ్ కలసి నటించిన ఆ చిత్రం ఘన విజయం సాధించింది. దీనితో వార్ 2పై ఆసక్తి పెరిగిపోయింది. వచ్చే వారమే వార్ 2 షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు తాజాగా చిత్ర బృందం అఫీషియల్ గా ప్రకటించింది.

వార్ 2 లో ఈసారి హృతిక్ తో పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా నటిస్తున్నాడు అని చెప్పగానే అంచనాలు తారా స్థాయికి చేరాయి. యశ్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో తారక్ భాగం కాబోతుండడం ఆసక్తిగా మారింది. వార్-2 చిత్రాన్ని దర్శకుడు అయాన్ ముఖర్జీ రూపొందిస్తున్నారు.ఈ చిత్రంలో హృతిక్ రోషన్ ని మరింత కొత్తగా చూపించబోతున్నట్లు తెలుస్తోంది. హృతిక్ రోషన్ ఫిబ్రవరి 23 నుంచి వార్ 2 షూటింగ్ లో జాయిన్ అవుతారు. ఈ ఫస్ట్ షెడ్యూల్ లో దర్శకుడు అయాన్ ముఖర్జీ.. హృతిక్ రోషన్ ఇంట్రడక్షన్ సీన్ ని రెండు వారాల పాటు చిత్రికరించబోతున్నారు. ఆడియన్స్ కి గూస్ బంప్స్ తెప్పించే విధంగా మైండ్ బ్లోయింగ్ యాక్షన్ తో హృతిక్ ఇంట్రడక్షన్ ఉండబోతోందట.  

గత రెండు వారాల నుంచి హృతిక్ వార్ 2 చిత్రం కోసం పర్ఫెక్ట్ బాడీ షేప్ పొందేందుకు జిమ్ లో కష్టపడుతున్నారు. ఆ సమయంలోనే హృతిక్ గాయపడ్డారు. ప్రస్తుతం హృతిక్ కోలుకుంటున్నారు. వచ్చే వారం షూటింగ్ కోసం రంగంలోకి దిగబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ చిత్రం డార్క్ థీమ్ లో ఇండియన్ స్క్రీన్ పై నెవర్ బిఫోర్ యాక్షన్ ఫీస్ట్ అందించబోతున్నట్లు తెలుస్తోంది. 

ఇండియాలో ఇద్దరు టాప్ స్టార్స్ హృతిక్, ఎన్టీఆర్ నటించబోతున్న 'వార్ 2' చిత్రం ఫాన్స్ సెలెబ్రేట్ చేసుకునేలా ఉంటుంది. ఇటు సౌత్ లో ఉన్న అభిమానులకు, నార్త్ లో ఉన్న అభిమానులకు ఈ చిత్రం ఒక పండగే అని చిత్రబృందం చెబుతోంది. వచ్చే ఏడాది ఆగష్టు 14న ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.