English | Telugu
భర్త కోసం కియారా అంత పని చేసిందా?
Updated : Aug 16, 2023
ఈ ఏడాది మూడు ముళ్లతో ఒక్కటయ్యారు చిరకాల ప్రేమ జంట సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ. వీరిద్దరూ కలిసి నటించిన షేర్‌షా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. వీరిద్దరూ విడివిడిగా ఇంకెవరినో పెళ్లి చేసుకోవడం సరికాదని నెటిజన్లు కూడా కోరుకున్నారు. అందరి కోరికలూ ఫలించి వీరిద్దరూ ఈ ఏడాది ఒక్కటయ్యారు. ఈ ఇండిపెండెన్స్ డే సందర్భంగా జై జవాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు కొత్త దంపతులు. ఈ సందర్భంగా పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. పెళ్లయిన తర్వాత కిచెన్‌లో కియారా చేసిన ఫస్ట్ రెసిపీ ఏంటనే ప్రశ్న ఎదురైంది. కియారా సమాధానం ఇస్తూ ``ఇప్పటిదాకా నేనేం వంట చేయలేదు. జస్ట్ వేడి నీళ్లు పెట్టాను. నేను చాలా లక్కీ ఈ విషయంలో. ఎందుకంటే సిద్ధార్థ్ చాలా బాగా వంట చేస్తారు. తనకి వంట చేయడం అంటే చాలా ఇష్టం. ఏ మాత్రం ఖాళీ ఉన్నా వంటింట్లోకి దూరిపోయి ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు.
నేను తినిపెడతాను. తనలాగా బ్రెడ్ వెరైటీలు ఎవరూ చేయలేరు. బ్రెడ్‌తో ఎప్పుడేం తినాలనుకున్నా తననే అడుగుతాను`` అని అన్నారు. అత్యంత సన్నిహితులు, కుటుంబసభ్యుల మధ్య ఫిబ్రవరి 7న వివాహం చేసుకున్నారు సిద్ - కియారా. పెళ్లికి ముందే కియారా ప్రెగ్నెంట్ అని పుకార్లు వచ్చాయి. అయితే వాటిలో ఏ మాత్రం నిజం లేదని ఇప్పుడు తేలింది. ప్రస్తుతం కియారా తెలుగులో గేమ్ చేంజర్ చేస్తున్నారు. వినయవిధేయ రామా సినిమా తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న సినిమా ఇది. రోహిత్ శెట్టి ఇండియన్ పోలీస్ ఫోర్స్ లో నటిస్తున్నారు సిద్ధార్థ్ మల్హోత్రా. యోధాలోనూ నటిస్తున్నారు. డిసెంబర్‌లో విడుదలకు సిద్ధమవుతోంది యోధ.