Read more!

English | Telugu

ఎరోటిక్ హారర్ మూవీ 'అలోన్ ఎట్ నైట్'

 

'ప్రైవేట్ ప్రోపర్టీ' ఫేం యాష్లే బెన్సన్ నటిస్తోన్న లేటెస్ట్ ఫిల్మ్ 'అలోన్ ఎట్ నైట్'. ఎరోటిక్ హారర్ ఫిలింగా ఇది రూపొందుతోంది. యు.ఎస్.ఎ. రైట్స్‌ను చేజిక్కించుకున్న వర్టికల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ మూవీని థియేటర్లలో, డిజిటల్ ఔట్‌లెట్స్‌లో 2023 జనవరి 20న విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది.

బాధాకరమైన బ్రేకప్ నుంచి బయటకు రావడానికి ప్రయత్నించే విక్కీ (యాష్లే బెన్సన్) అనే అమ్మాయి కథ ఈ మూవీ. మారుమూలనున్న ఒక ఫ్రెండ్ కేబిన్‌లో ఉంటూ, పూర్వ స్థితికి రావడానికి యత్నించే ఆమె ఒక అడల్ట్స్ ఓన్లీ లైవ్ స్ట్రీమింగ్ వెబ్‌సైట్‌కు సంబంధించిన లోదుస్తులకు మోడలింగ్ చేయడాన్ని కొనసాగిస్తుంటుంది.

కానీ కరెంటు పోయినప్పుడు, విక్కీ చీకట్లో తన కోసం ఏదో భయంకరమైంది ఎదురు చూస్తున్నదని విక్కీ తెలుసుకుంటుంది. ముసుగు ధరించిన ఒక కిల్లర్ ఒక క్రోబార్ పట్టుకుని ఆ రాత్రి ఆమె జీవితానికి భయంకరమైన ముగింపు ఇవ్వాలని చూస్తున్నాడు. ఈ మూవీలో పమేలా ఆండర్సన్ (బేవాచ్), లూయిస్ గుజ్‌మాన్ (ట్రాఫిక్), మోడల్ విన్నీ హార్ళొ, పారిస్ హిల్టన్, లిండ్సే పెలాస్ (ఎక్స్‌ట్రాక్షన్), జాన్ రాబిన్‌సన్ (లార్డ్స్ ఆఫ్ డాగ్‌టౌన్) స్కై ఫెరీరా (బేబీ డ్రైవర్) కీలక పాత్రధారులు.

"ఒక టీనేజర్‌గా ఎలాంటి మూవీని చూడాలని కోరుకుంటానో అలాంటి మూవీ 'అలోన్ ఎట్ నైట్'. కిల్లర్ మ్యూజిక్‌తో సెక్సీ థ్రిల్లర్‌గా ఇది రూపొందుతోంద"ని డైరెక్టర్ జిమ్మీ గియాన్నోపౌలస్ చెప్పాడు.