English | Telugu
రానాకి సోనమ్ ఘాటు కౌంటర్
Updated : Aug 16, 2023
టాలీవుడ్ స్టార్ రానా దగ్గుబాటి టైమ్ అస్సలు బాగున్నట్లు లేదు. ఎందుకంటే రీసెంట్‌గా ఆయన దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన.. కింగ్ ఆఫ్ కోథా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రానా ఓ హీరోయిన్ పేరు చెప్పకుండా ఆమె తన భర్తతో చేసిన షాపింగ్ వల్ల హీరో దుల్కర్ అండ్ టీమ్ పడ్డ ఇబ్బందులు గురించి కామెంట్స్ చేశారు. రానా పేరు చెప్పకపోయినప్పటికీ సోనమ్ కపూర్‌ని ఉద్దేశించే ఆయన కామెంట్స్ చేశారంటూ వార్తలు నెట్టింట వైరల్ అయ్యాయి. అయితే తన తప్పును వెంటనే రానా సరిదిద్దుకునే పనిలో పడ్డారు. అందులో భాగంగా ఆయన తన సోషల్ మీడియా ద్వారా ఆమెకు క్షమాపణలు చెప్పారు.
తాజాగా రానా తనపై చేసిన కామెంట్స్‌కు సోనమ్ కపూర్ రియాక్ట్ అయ్యింది. ఆమె కూడా రానా పేరుని ప్రస్తావించకుడానే గట్టి కౌంటర్ ఇచ్చింది. ఎలియనోర్ రూజ్‌వెల్డ్ అనే సామాజికవేత్త సందేశాన్ని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇంతకీ ఆమె షేర్ చేసిన విషయం ఏంటంటే..‘ఎదుటి వ్యక్తుల గురించి మాట్లాడేవారు మనస్తత్వం సంకుచితంగా ఉంటుంది. కాస్త ఆలోచనను కలిగిన వారు పరిస్థితుల గురించి మాట్లాడుతారు. అయితే గొప్ప ఆలోచనను కలిగినవారు మాత్రం పరిస్థితుల గురించి చర్చిస్తారు’ అనే సందేశాన్ని షేర్ చేస్తూ ‘ఇది చిన్న విషయమే అయినప్పటికీ దీన్ని కొంత మంది అర్థం చేసుకోవాలి. వదంతుల గురించి మాట్లాడేటప్పుడు దీన్ని గుర్తుంచుకోవాలని అనుకుంటున్నాను’ అని ఆమె మెసేజ్‌ను కూడా పోస్ట్ చేశారు.
అయితే సోనమ్ కపూర్ ఏం తక్కువ తినలేదని, రానా తనను ఉద్దేశించి చేసిన కామెంట్స్‌కు కౌంటర్ ఎటాక్‌గానే ఆమె తాజా పోస్ట్ చేసిందని అంటున్నారు నెటిజన్స్.