English | Telugu

పోజుతో గిన్నిస్ రికార్డు కొట్టేసిన బాద్షా!

షారుఖ్ పోజుకి గిన్నిస్ రికార్డు వ‌చ్చేసింది. షారుఖ్ ఐకానిక్ పోజును ఎక్కువ మంది పెర్ఫార్మ్ చేసినందుకుగానూ ఈ రికార్డు వ‌చ్చింది. ప‌ఠాన్ టీవీ ప్రీమియ‌ర్లను పుర‌స్క‌రించుకుని ఈ రేర్ ఫీట్‌ని సాధించారు షారుఖ్ ఫ్యాన్స్.

షారుఖ్ సొంత బంగ్లా మ‌న్న‌త్ ముందు దాదాపు 300 మంది ఫ్యాన్స్ గుమిగూడారు. ఈ సీ ఫేసింగ్ బంగ్లా ముందే ఐకానిక్ పోజును వాళ్లు పెర్ఫార్మ్ చేశారు. చేతులు వెన‌క్కి చాచిన‌ట్టుగా చాచి, ఈ రికార్డును సాధించారు. ఈ సెల‌బ్రేష‌న్ల‌న్నీ జ‌రుగుతున్న‌ట్టు షారుఖ్‌కి కూడా తెలుసు. అత‌ను కూడా అభిమానుల‌తో క‌లిసి ఆ పోజును ప్ర‌ద‌ర్శించారు. త‌న కాంపౌండ్‌లో క‌ట్టిన ప్లాట్‌ఫార్మ్ మీద షారుఖ్ ఈ పోజును అభిన‌యించారు.

57 ఏళ్ల షారుఖ్ ఖాన్ ప‌ఠాన్ సినిమాలోని జూమే జో ప‌ఠాన్ పాట‌కు స్టెప్పులేయ‌డం, అభిమానుల‌తో ఆనందాన్ని పంచుకోవ‌డం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఈ రికార్డుల‌న్నీ ప‌ఠాన్ టెలివిజ‌న్ ప్రీమియ‌ర్ సెల‌బ్రేష‌న్లో భాగంగా జ‌రిగాయి. దాదాపు నాలుగేళ్ల త‌ర్వాత అనుకున్న హిట్‌ని ప‌ఠాన్‌తో సొంతం చేసుకున్నారు షారుఖ్‌. గ్లోబ్ ట్రాట్టింగ్ స్పై థ్రిల్ల‌ర్ ప‌ఠాన్‌ని సిద్ధార్థ్ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. య‌ష్‌రాజ్ ఫిల్మ్స్ నిర్మించింది. ఈ నెల 18న టీవీల్లో ప్రీమియ‌ర్స్ ప‌డ‌నున్నాయి.

"షారుఖ్ ఫ్యాన్స్ అంద‌రూ క‌లిసి చేసిన ఈ రేర్ రికార్డును స్టార్ చాలా హ్యాపీగా ఫీల‌య్యారు. ప్ర‌తి అభిమాని గుండెల్లోనూ తాను శాశ్వ‌తంగా ఉంటున్నందుకు ఆనందంగా ఉందని చెప్పారు" అంటూ షారుఖ్ త‌ర‌ఫువారు పంచుకున్నారు.

దీపిక ప‌దుకోన్ నాయిక‌గా న‌టించారు ప‌ఠాన్‌లో. జాన్ అబ్ర‌హామ్‌, డింపుల్ క‌పాడియా, అశుతోష్ రానా ఇతర పాత్ర‌ల్లో క‌నిపించారు. ప‌ఠాన్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా వెయ్యి కోట్ల‌కు పైగా క‌లెక్ట్ చేసింది.