English | Telugu

'యానిమల్‌'లో బ్రూట‌ల్‌గా క‌నిపిస్తున్న ర‌ణ్‌బీర్‌

ర‌ణ్‌బీర్ క‌పూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న సినిమా యానిమల్‌. విజ‌య్ దేవ‌ర‌కొండ తెలుగులో న‌టించిన అర్జున్ రెడ్డిని హిందీలో క‌బీర్ సింగ్ పేరుతో తెర‌కెక్కించి సూప‌ర్ స‌క్సెస్ అయ్యారు సందీప్ రెడ్డి వంగా. ఇప్పుడు యానిమల్‌ తో త‌న స్టామినాని ప్రూవ్ చేసుకోవాల‌నుకుంటున్నారు. యానిమల్‌ విడుద‌ల‌కు స‌రిగ్గా రెండు నెల‌ల స‌మ‌యం ఉందంటూ కౌంట్‌డౌన్‌ని గుర్తుచేస్తూ ప్రి టీజ‌ర్‌ని విడుద‌ల చేశారు. బ్యాక్ గ్రౌండ్‌లో పంజాబీ మ్యూజిక్‌తో యానిమల్‌ ప్రి టీజ‌ర్ అదిరిపోయింది. మాస్క్ వేసుకున్న వ్య‌క్తి, అత‌ని చేతిలో చెల‌రేగిపోయిన గొడ్డ‌లితో ఆక‌ట్టుకుంటోంది యానిమల్‌ ప్రి టీజ‌ర్‌.

ర‌ణ్‌బీర్ క‌పూర్‌, అనిల్ క‌పూర్‌, ర‌ష్మిక మంద‌న్న‌, బాబీ డియోల్‌, త్రిప్తి డిమ్రి కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన ఈ సినిమాను ఆగ‌స్టు 11న విడుద‌ల చేయ‌నున్నారు. హిందీ, త‌మిళ్‌, తెలుగు, క‌న్న‌డ‌, మ‌ల‌యాళంలో విడుద‌ల చేయ‌నున్నారు. భూష‌ణ్‌కుమార్‌, కృష‌న్ కుమార్ టీసీరీస్‌, మురాద్ ఖేతాని సినేల్ స్టూడియోస్‌, ప్ర‌ణ‌య్ రెడ్డి వంగా భ‌ద్ర‌కాళి పిక్చ‌ర్స్ నిర్మిస్తున్నాయి.

యానిమల్‌ లో న‌టించ‌డం గురించి ర‌ష్మిక మంద‌న్న మాట్లాడుతూ "సందీప్ సర్‌, ర‌ణ్‌బీర్ క‌పూర్ ఒక‌రినొక‌రు అద్భుతంగా అర్థం చేసుకున్నారు. ర‌ణ్‌బీర్ క‌పూర్ ద‌ర్శ‌కుడికి కావాల్సిన‌ట్టు చేసే న‌టుడు. సందీప్‌గారు న‌టుడికి కావాల్సిన‌ట్టు ఉండే ద‌ర్శ‌కుడు. వాళ్లిద్ద‌రి కాంబో అద్భుతంగా కుదిరింది. ప్రేక్ష‌కులు పిచ్చెక్కిపోయే స్ట‌ఫ్ ఉంది సినిమాలో. నేను బేసిగ్గా పెట్స్ తో ఎక్కువ స‌మ‌యం గ‌డుపుతాను. కొరియ‌న్ డ్రామాలు చూస్తాను. డెజ‌ర్ట్స్ ఎక్కువ తింటాను. నా ల‌క్ష‌ణాల‌కీ,ఈ సినిమాలో కేర‌క్ట‌ర్‌కీ పోలిక‌లు లేవు" అని అన్నారు.

సందీప్ రెడ్డి వంగా హిందీలో ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న రెండో సినిమా యానిమల్‌. 2019లో క‌బీర్‌సింగ్ తెర‌కెక్కించారు. ఆ త‌ర్వాత ఆయ‌న చేస్తున్న సినిమా ఇదే. గ్యాంగ్‌స్ట‌ర్ ఫ్యామిలీ చుట్టూ తిరిగే క‌థ ఇది. ర‌ణ్‌బీర్ వైఫ్‌గా ర‌ష్మిక మంద‌న్న క‌నిపిస్తారు. ర‌ణ్‌బీర్ తండ్రిగా అనిల్ క‌పూర్ న‌టిస్తున్నారు. ఏప్రిల్ 14న పెళ్లి చేసుకున్న ర‌ణ్‌బీర్ ఫ‌స్ట్ అటెండ్ అయింది కూడా యానిమల్‌ షూటింగ్‌కే. మ‌నాలిలో ఈ షూటింగ్ స‌మ‌యంలో ర‌ణ్‌బీర్ ప‌క్క‌నే ఉన్నారు ఆలియా.