English | Telugu
జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్న సల్మాన్‌ఖాన్!
Updated : Aug 22, 2023
సల్మాన్ గత కొన్నాళ్లుగా స్క్రిప్టులు చదవడంలోనే బిజీగా ఉండిపోయారు. ఆయన నటిస్తున్న టైగర్3 ప్రస్తుతం సెట్స్ మీదుంది. ఈ సినిమాను దీపావళికి విడుదల చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఆయన విష్ణువర్ధన్ దర్శకత్వంలో ఓ థ్రిల్లర్‌లో నటిస్తున్నారు. ఈ సినిమాకు కరణ్ జోహార్ నిర్మాత. ఈ సినిమా కోసం ఆల్రెడీ సల్మాన్‌ఖాన్ ప్రిపరేషన్ మొదలుపెట్టేశారు. నవంబర్‌లో ఈ సినిమా షెడ్యూల్‌ని ప్రారంభించాలన్నది సల్మాన్ ప్లాన్. సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో పారా మిలిటరీ ఆఫీసర్‌గా నటిస్తారు. అందుకు తగ్గట్టు లుక్ వైజ్ ప్రిపేర్ అవుతున్నారు. ఇప్పటికే బరువు కూడా తగ్గుతున్నారు. ఈ పనులన్నీ ప్రోగ్రెస్‌లో ఉన్నాయి. మల్టిపుల్ షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారు విష్ణువర్ధన్. వచ్చే ఏడాది క్రిస్మస్‌కి ఈ సినిమాను విడుదల చేయాలన్నది విష్ణువర్ధన్ ప్లాన్.
నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకు దాదాపు నెల రోజుల పాటు ఫస్ట్ షెడ్యూల్ ఉంటుంది. దీన్ని పూర్తి చేసిన తర్వాత, సల్మాన్ ఇయర్ ఎండ్ బ్రేక్ తీసుకుంటారు. జనవరి 10 నుంచి సెకండ్ షెడ్యూల్లో పాల్గొంటారు. నెల నుంచి నెలన్నర షెడ్యూల్ ఉంటుంది. ఆ తర్వాత మార్చిలోగానీ, ఏప్రిల్‌లో గానీ సల్మాన్ నెక్స్ట్ మూవీ షూటింగ్‌కి వెళ్తారు. ఆ సమయంలో టైగర్ వర్సెస్ పఠాన్‌కి డేట్లు కేటాయించారు సల్మాన్ ఖాన్. టైగర్ వర్సెస్ పఠాన్‌లో సల్మాన్‌ఖాన్, షారుఖ్ కలిసి నటిస్తారు. సమ్మర్‌లో కూల్ ప్రాంతాల్లో షూటింగ్‌ని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఒకరికి, ఇద్దరు స్టార్ల కాల్షీట్లు ఆ సమయంలోనే దొరకడంతో వీలైనంత వరకు స్పీడ్‌గా షూటింగ్ పూర్తి చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారు. మే ఎండింగ్‌లోపు కాంబినేషన్ సీన్స్ పూర్తి చేయాలన్నది ప్లాన్. 2024 జూన్ నుంచి విష్ణువర్ధన్ సినిమా ఫైనల్ షెడ్యూల్‌లో పాల్గొంటానని మాటిచ్చారట సల్మాన్. జులై ఎండింగ్ వరకు ఈ షెడ్యూల్ ఉంటుంది. అంతలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా సైడ్ బై సైడ్ చేసుకునేలా ప్లాన్ చేసుకుంటున్నారట విష్ణువర్ధన్.