English | Telugu
రణ్‌వీర్‌ని చూస్తే భయం లేదంటున్న డైరక్టర్
Updated : Aug 23, 2023
రణ్‌వీర్‌ని చూస్తే నాకేం భయం అనిపించడం లేదని చెబుతున్నారు డైరక్టర్ ఫర్హాన్ అక్తర్. రణ్‌వీర్ హీరోగా డాన్3 మూవీని అనౌన్స్ చేశారు ఫర్హాన్. డాన్ ఫ్రాంఛైజీలో ఇంతకు పూర్వం అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్ నటించారు. ఇప్పుడు మూడో చాప్టర్‌లో రణ్‌వీర్ నటించనున్నారు. ఫర్హాన్ అక్తర్ నార్త్ మీడియాతో మాట్లాడుతూ ఇంట్రస్టింగ్ డీటైల్స్ రివీల్ చేశారు. ``న్యూ డాన్‌గా రణ్‌వీర్‌ని అనౌన్స్ చేసినప్పటి నుంచి రకరకాల రియాక్షన్స్ వస్తున్నాయి. వెర్సటైల్ యాక్టర్స్ ప్లేస్‌ని ఎందుకు రణ్‌వీర్‌కి ఇచ్చారంటూ పలు ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అయితే నేను వాటి గురించి అసలు ఆలోచించడం లేదు. ఎందుకంటే, నాకు రణ్‌వీర్ మీద కించిత్తు అనుమానం కూడా లేదు. అద్భుతంగా నటిస్తాడు. నేచురల్‌గా పెర్ఫార్మ్ చేస్తాడనే భరోసా ఉంది.
2006లో షారుఖ్ ఖాన్ డాన్ రోల్ చేస్తానని అన్నప్పుడు కూడా అమితాబ్ చేసిన రోల్‌ని అసలు ఎలా టచ్ చేస్తావని ఎవరికి తోచిన రీతిలో వాళ్లు మండిపడ్డారు. ఇప్పుడు సోషల్ మీడియా మరింతగా పెరిగింది కాబట్టి, ఇంకాస్త ఇంపాక్ట్ కనిపిస్తోంది`` అని అన్నారు. కొన్ని సినిమాలతో జనాలకు ఎమోషనల్ కనెక్షన్స్ ఉంటాయని అంటున్నారు ఫర్హాన్ అక్తర్. ఆయన మాట్లాడుతూ ``మనం ఎమోషన్స్‌ని గౌరవించాలి. నేను డాన్ పరంగా అందరి ఎమోషన్స్ ని గౌరవిస్తున్నాను. రణ్‌వీర్ చేస్తున్నాడని తెలియగానే బాధపడ్డ వారినీ గౌరవిస్తున్నాను. సంతోషించిన వారినీ గౌరవిస్తున్నాను`` అని అన్నారు. రితేష్ సిద్వానీ ప్రొడక్షన్ హౌస్ ఎక్సల్ ఎంటర్‌టైన్‌మెంట్ డాన్3ని నిర్మిస్తోంది. ఈ సినిమాలో రణ్‌వీర్ సరసన దీపిక పదుకోన్‌ని అడుగుతున్నారు.