English | Telugu

ఓ మైగాడ్‌2 ని నిర్మాత‌లు ఎందుకు ఒప్పుకోలేదు?

అక్ష‌య్‌కుమార్‌, పంక‌జ్ త్రిపాఠి న‌టించిన సినిమా ఓ మైగాడ్ 2. ఈ సినిమాకు అమిత్ రాయ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమా మెటీరియ‌లైజ్ కావ‌డానికి ముందు ప‌లువురు నిర్మాత‌లు ఈ స్క్రిప్ట్ ని రిజ‌క్ట్ చేశార‌ట‌. రీసెంట్ టైమ్స్ లో బాలీవుడ్‌లో స‌క్సెస్ అయిన స‌బ్జెక్టుల్లో ఓ మై గాడ్ 2 కూడా ఒక‌టి. ఈ సినిమా వంద కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. పంక‌జ్ త్రిపాఠి, యామీ గౌత‌మ్ కీ రోల్స్ చేశారు. అక్ష‌య్ ఈ ప్రాజెక్టుకి ఓ నిర్మాత‌. వ‌యాకామ్ 18 స్టూడియోస్‌, కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్, వ‌కావూ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమాలో స్కూల్లో సెక్స్ ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ గురించి డిస్క‌స్ చేశారు. ఈ అటెంప్ట్ ని మెచ్చుకున్నారు అక్ష‌య్‌. సినిమాను ప్రొడ్యూస్ చేయ‌డానికి ముందుకొచ్చారు.

దీని గురించి అమిత్ రాయ్ మాట్లాడుతూ ``ఈ సినిమాలో నేను చెప్పాల‌నుకున్న విష‌యాల మీద నాకు చాలా క్లారిటీ ఉంది. అందుకే ఎవ‌రు ఎన్ని సార్లు చెప్పినా నేను స్క్రిప్ట్ మార్చ‌లేదు. దాదాపు తొమ్మిది ప్రొడ‌క్ష‌న్ హౌస్‌ల చుట్టూ తిరిగాను. చాలా మంది ఈ సినిమాలో బోల్డ్ కంటెంట్‌కి భ‌య‌ప‌డి రిజక్ట్ చేశారు. కానీ అక్ష‌య్ స్క్రిప్ట్ ని న‌మ్మారు. కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్, వ‌కావూ ఫిల్మ్స్ నిర్మించ‌డానికి ముందుకు వ‌చ్చాయి. అక్ష‌య్‌కుమార్ రెమ్యున‌రేష‌న్ తీసుకోకుండా భాగ‌స్వామి అయ్యారు. అందుకే అంత త‌క్కువ బ‌డ్జెట్‌లో సినిమా పూర్త‌యింది. విడుద‌ల‌య్యాక అంద‌రూ మెచ్చుకుంటూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. అక్ష‌య్‌కుమార్‌లాంటి వాళ్లు ప‌క్క‌నుంటే, ఎన్ని అడ్డంకుల‌నైనా దాటేయ‌వ‌చ్చు. మ‌నమీద మ‌న‌కు కాన్ఫిడెన్స్ తీసుకొచ్చే న‌టుడు ఆయ‌న‌`` అని అన్నారు.

ఈ చిత్రంలో కామినిమ‌హేశ్వ‌రి అనే లాయ‌ర్ పాత్ర‌లో చేశారు యామీ గౌత‌మ్‌. ఆమె గురించి ద‌ర్శ‌కుడు చెబుతూ ``ఫ‌స్ట్ పార్ట్ మేల్ డామినేటెడ్‌గా సాగుతుంది. అందుకే సెకండ్ పార్టు ఫీమేల్ ఓరియంటెడ్‌గా ఉంటే బావుంటుంద‌నిపించింది. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఫీమేల్ లాయ‌ర్ కేర‌క్ట‌ర్‌ని డిజైన్ చేశాం. యామీ గౌత‌మ్ ఆ కేర‌క్ట‌ర్‌కి న్యాయం చేశారు`` అని చెప్పారు.