English | Telugu
ఖిలాడీతో కలిసిన సునీల్... ప్రీ ప్రొడక్షన్ షురూ!
Updated : Aug 16, 2023
అక్షయ్‌కుమార్ హీరోగా ఫిరోజ్ నదియడ్‌వాలా తెరకెక్కిస్తున్న సినిమా వెల్కమ్ 3. ఆవారా పాగల్ దీవానా2, హెరా ఫెరీ3 తర్వాత తెరకెక్కుతున్న సినిమా ఇది. వెల్కమ్ 3లో అక్షయ్‌కుమార్‌తో పాటు సంజయ్ దత్, అర్షద్ వార్షి కూడా కలిసి నటిస్తున్నారు. ఈ నెల ప్రారంభంలో ఈ సినిమా యూనిట్ స్పెషల్ ఫొటో షూట్ చేసింది. సినిమాను అనౌన్స్ చేయడానికే ఈ ఫొటో షూట్ చేశారు. ఈ మూవీలో జాక్వలిన్ ఫెర్నాండెజ్, దిశా పటానీ నాయికలుగా నటిస్తున్నారు. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.
వెల్కమ్ 3 కోసం తాజాగా సునీల్ శెట్టిని రిక్రూట్ చేశారు. పవర్‌ఫుల్ రోల్ గురించి వినగానే ఓకే చెప్పేశారట సునీల్ శెట్టి.
``ఫిరోజ్ నదియాడ్‌వాలా, అక్షయ్‌కుమార్‌తో సునీల్‌శెట్టికి మంచి అనుబంధం ఉంది. అందుకే వెల్కమ్ 3 గురించి తెలియగానే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఈ ఫ్రాంఛైజీలో ఇంతవరకు లేనటువంటి రోల్ చేయడం ఎగ్జయిటింగ్‌గా ఉందని అంటున్నారు సునీల్ శెట్టి. ఇది కామిర్ రోల్. ఆయన కేరక్టర్‌కి చాలా షేడ్స్ ఉంటాయి`` అని అంటున్నారు సన్నిహితులు.
వెల్కమ్ 3లో ఫేమస్ ఎడా అన్నా కేరక్టర్‌లో మాత్రం చేయడం లేదు సునీల్ శెట్టి. ఆయన కోసం స్పెషల్‌గా కేరక్టర్‌ని డిజైన్ చేశారు. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే కొన్ని షూటింగ్ లొకేషన్లు చూసేశారు. కొన్నిటిని ఫైనల్ చేశారు. ప్రస్తుతం కేరక్టర్ల లుక్స్, యాక్షన్స్ సీన్స్ మీద వర్కవుట్ చేస్తున్నారు.
వెల్కమ్ టు ద జంగిల్ అంటూ అడ్వంచరస్ కామెడీగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. వచ్చే ఏడాది క్రిస్‌మస్ వీకెండ్‌లో విడుదల చేయాలన్నది ప్లాన్.