English | Telugu
కాజోల్ హజ్బెండ్‌తో మూడు సినిమాల డీల్!
Updated : Jun 15, 2023
నా మానసిక పరిస్థితి బాలేదు అంటూ ఇటీవల సోషల్ మీడియాకు బ్రేక్ తీసుకున్నారు కాజోల్ దేవ్గన్. అదంతా ఆమె అప్‌కమింగ్ ప్రాజెక్టుల ప్రమోషన్లో భాగమేనని అన్నవారు కూడా లేకపోలేదు. ఆ సంగతి అలా ఉంచితే, ఆమె భర్త అజయ్ దేవ్గన్ నటించిన సినిమాల్లో బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాలను ఇప్పుడు ఒకే ప్లాట్ఫార్మ్ తీసుకుంది. బ్లాక్ మ్యాజిక్, రైడ్2, దృశ్యం3 పోస్ట్ థియేట్రికల్ స్ట్రీమింగ్ రైట్స్ జియో చేతికి అందాయి. కుమార్ మంగత్‌తో అజయ్ దేవ్గన్ తెరకెక్కిస్తున్న సూపర్ నేచురల్ థ్రిల్లర్ బ్లాక్ బ్యాజిక్. రాజ్‌కుమార్ గుప్తా ప్రస్తుతం అజయ్ హీరోగా రెయిడ్2 స్క్రిప్ట్ పనులు కానిస్తున్నారు. సింఘం అగైన్ షూటింగ్ ఎలాగూ ఆగస్టు నుంచి మొదలవుతుంది. మరో ఎనిమిది నెలల్లో షూటింగ్ పూర్తవుతుంది. ఆ తర్వాత దృశ్యం3 సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. ఒకప్పుడు అక్షయ్‌కుమార్ బాలీవుడ్లో ఇంత బిజీగా ఉండేవారు.
ఇప్పుడు ఆ ప్లేస్‌ని అజయ్ దేవ్గన్ తీసుకున్నారు. ఏడాదిలో ఎక్కువ కాలం ఆయన షూటింగ్లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. రాబోయే 18 నెలల్లో ఆయన కాల్షీట్ ఒక్కరోజు కూడా ఖాళీ లేదంటే సిట్చువేషన్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. బ్లాక్ మ్యాజిక్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ సినిమా. గుజరాతీ చిత్రం వాష్ ఆధారంగా తెరకెక్కించారు. దాదాపు 40 రోజుల్లో చిత్రీకరించారు. రెయిడ్ 2 డ్రమాటిక్ థ్రిల్లర్. 2024 వేసవికి ఈ చిత్రం విడుదల కానుంది. ఈ మధ్యలో మైదాన్ ఎప్పుడైనా విడుదల కావచ్చు. ఇప్పటికి అరడజను సార్లకు పైగా వాయిదా పడింది మైదాన్. అటు ఆరో మే కహా ధమ్ థా, అభిషేక్ కపూర్ దర్శకత్వంలో ఇంకో సినిమా ఎలాగూ రిలీజ్కున్నాయి.