English | Telugu
సూర్య హిందీ డెబ్యూ... బాలీవుడ్‌లో కర్ణుడిగా!
Updated : Jun 13, 2023
సూర్య గురించి ఓ ఆసక్తికరమైన విషయం ట్రెండ్ అవుతోంది. బాలీవుడ్‌లో కర్ణుడిగా నటించడానికి సూర్య ఓకే చెప్పారన్నది ఆ న్యూస్. రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా తెరకెక్కిస్తున్న కర్ణ మూవీ కోసం సూర్యను అప్రోచ్ అయ్యారట. మహాభారతం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. రాకేష్ చెప్పిన స్క్రిప్ట్ కి సూర్య ఫిదా అయ్యారన్నది టాక్. సౌత్‌లో మంచి మార్కెట్ ఉన్న హీరో సూర్య. తమిళ్‌కి మాత్రమే పరిమితం కాకుండా, తెలుగులోనూ మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్న హీరో.ఆకాశం నీ హద్దురా ఆయనకు నేషనల్ అప్లాజ్ తెచ్చిపెట్టింది.
ప్రస్తుతం దరువు శివ దర్శకత్వంలో కంగువ మూవీ చేస్తున్నారు సూర్య. ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్‌కి విడుదల చేయనున్నారు. ఈ సినిమా పూర్తయ్యాక సుధ కొంగరతో ఓ సినిమా, వెట్రిమారన్‌తో మరో సినిమా చేస్తారు సూర్య. ఇవన్నీ పూర్తి కాగానే హిందీ డెబ్యూ ప్లాన్ చేసుకుంటున్నారు. గత కొన్నాళ్లుగా రాకేష్ ఓంప్రకాష్ మెహ్రాతో ట్రావెల్ అవుతున్నారు సూర్య. రెండు భాగాలుగా కర్ణను తీయడానికి రెడీ అవుతున్నారు రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా. 2024 చివరిలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది. ``ఇండియన్ సినిమా గేమ్ చేంజర్ అవుతుంది కర్ణ. ఇప్పటిదాకా కర్ణుడిని ఎవరూ చూడని యాంగిల్‌లో చూపించడానికి సిద్ధమయ్యారు రాకేష్. అద్భుతమైన నటుడు, కళ్లతోనే భావాలు పలికించగల నటుడు కావాలని రాకేష్ సూర్యని సెలక్ట్ చేసుకున్నారు`` అని అంటోంది బాలీవుడ్ మీడియా. సూర్యకున్న సౌత్ మార్కెట్‌ని దృష్టిలో పెట్టుకుని లావిష్‌గా మూవీ తీసి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట రాకేష్.