English | Telugu

రిలీజ్‌కి రెడీ అవుతున్న ఆలియా!

ర‌ణ్‌వీర్‌సింగ్‌, ఆలియా భ‌ట్ జంట‌గా న‌టించిన సినిమా రాఖీ ఔర్ రాణీ కీ ప్రేమ్ క‌హానీ. ఈ చిత్రం టీజ‌ర్‌ని ఈ నెల 20న రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ట్రైల‌ర్‌ను జులైలో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. క‌ర‌ణ్ జోహార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. దాదాపు ఏడేళ్ల త‌ర్వాత ఆయ‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సినిమా ఇది. గ‌త నెల ర‌ణ్‌వీర్ సింగ్‌, ఆలియా రొమాంటిక్ పిక్స్ ని పోస్ట్ చేశారు క‌ర‌ణ్‌జోహార్‌. అప్ప‌టి నుంచే ఈ సినిమా మీద బ‌జ్ అందుకుంది. ఈ ప్రాజెక్టు గురించి క‌ర‌ణ్ మాట్లాడుతూ ``చాలా జాయ్‌ఫుల్‌గా ఉంటుంది ఈ సినిమా.

నాకే కాదు, అంద‌రికీ అలాగే అనిపిస్తుంది. జ‌యా బ‌చ్చ‌న్‌, ష‌బానా ఆజ్మీ, ధ‌ర్మేంద్ర‌, ర‌ణ్‌వీర్‌, ఆలియా... ఇంత మందితో ప‌నిచేయ‌డం చాలా ఆనందంగా ఉంది. కోల్‌క‌తా నుంచి కూడా చాలా మంది ఈ సినిమా కోసం ప‌నిచేశారు. సెన్సార్ బోర్డ్ టీజ‌ర్‌కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసింది. ఒక నిమిషం 19 సెక‌న్ల టీజ‌ర్ ఉంటుంది. ఈ సినిమాలో ప్ర‌తి ఎలిమెంట్ నాకు ఇష్టం`` అని అన్నారు. పెళ్లి త‌ర్వాత ఆలియా న‌టించిన బ్ర‌హ్మాస్త్ర విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ అయింది. అటు ఆలియా భ‌ర్త ర‌ణ్‌బీర్ కపూర్ కూడా స‌క్సెస్ మీదున్నారు. ర‌ణ్‌వీర్ సింగ్‌కి మాత్రం స‌రైన స‌క్సెస్‌లు లేవు. ఇప్పుడు ఆలియాతో చేసిన రాఖీ ఔర్ మూవీ అయినా ర‌ణ్‌వీర్ కి మంచి స‌క్సెస్ తెచ్చిపెడుతుందా? అని ఆస‌క్తిక‌రంగా ఎదురుచూస్తున్నారు బాలీవుడ్ ఫ్యాన్స్.