English | Telugu

'పిచ్చి పుల్లయ్య'గా ఎన్టీఆర్ అలరించి 70 ఏళ్ళు!

నటరత్న నందమూరి తారక రామారావు కెరీర్ లో ప్రత్యేకంగా నిలిచే చిత్రాల్లో 'పిచ్చి పుల్లయ్య' ఒకటి. ఇందులో అమాయకుడైన పల్లెటూరి యువకుడు పుల్లయ్య పాత్రలో టైటిల్ రోల్ చేసి అలరించారు ఎన్టీఆర్. తమ సొంత సంస్థ నేషనల్ ఆర్ట్ థియేటర్స్ (ఎన్.ఎ.టి) నుంచి మొట్టమొదటి సినిమా ఇదే కావడం విశేషం. వాణిజ్యపరంగా ఈ సినిమా ఆశించిన మేర విజయం సాధించకపోయినా.. తదనంతర కాలంలో సాంఘీక, జానపద, పౌరాణిక, చారిత్రక విభాగాల్లో చిత్రాలు నిర్మించిన అరుదైన సంస్థగా ఎన్.ఎ.టి వార్తల్లో నిలిచింది. అలాగే పలు విజయవంతమైన సినిమాలకు చిరునామాగా నిలిచింది నేషనల్ ఆర్ట్ థియేటర్స్. ఈ చిత్రానికి టి. ప్రకాశరావు దర్శకత్వం వహించడమే కాకుండా కథ, స్క్రీన్ ప్లే సమాకూర్చారు. ఎన్టీఆర్ సోదరుడు ఎన్. త్రివిక్రమరావు ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. 

‘‘నీ దారి పూల దారి’’.. చిరు ‘మగమహారాజు’కి 40 ఏళ్ళు

మెగాస్టార్ చిరంజీవి - దర్శకుడు విజయ బాపినీడు కాంబినేషన్ లో వచ్చిన చిత్రాలు కుటుంబ ప్రేక్షకులను భలేగా ఆకట్టుకున్నాయి. వాటిలో 'మగమహారాజు' ఒకటి. వాస్తవానికి ఈ చిత్రాన్ని మౌళి తెరకెక్కించాల్సింది. అయితే కొన్ని కారణాల వల్ల ఆ స్థానంలోకి విజయ బాపినీడు వచ్చారు.  సుహాసిని కథానాయికగా నటించిన ఈ సినిమాలో నిర్మలమ్మ, ఉదయ్ కుమార్, అన్నపూర్ణ, రావు గోపాల రావు, రాళ్ళపల్లి, రోహిణి, బాలాజీ, తులసి, హేమ సుందర్, నూతన్ ప్రసాద్, అనూరాధ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. ఆకెళ్ళ వెంకట సూర్యనారాయణ కథను అందించిన ఈ చిత్రానికి కాశీ విశ్వనాథ్ సంభాషణలు సమకూర్చారు.  

ఎన్టీఆర్ Vs కృష్ణ.. జయప్రదకి మాత్రం డబుల్ ధమాకా.. 45 ఏళ్ళ క్రితం వచ్చిన ఆ సినిమాలేంటో తెలుసా!

నటరత్న నందమూరి తారక రామారావు అంటే నటశేఖర కృష్ణకి ఎంతో అభిమానం. ఇద్దరు కలిసి కొన్ని చిత్రాల్లో అలరించారు కూడా.  అయితే, కొన్ని సందర్భాల్లో మాత్రం ఎన్టీఆర్ కి పోటిగా కృష్ణ నటించిన చిత్రాలు విడుదలైన వైనాలు ఉన్నాయి. 1977 సంక్రాంతికి అంటే జనవరి 14న రామారావు త్రిపాత్రాభినయం చేసి దర్శకత్వం వహించిన 'దానవీరశూరకర్ణ' విడుదల కాగా.. సరిగ్గా అదే రోజున కృష్ణ నటించిన 'కురుక్షేత్రం' రిలీజైంది. వీటిలో 'దానవీరశూరకర్ణ' అఖండ విజయం సాధించింది. కట్ చేస్తే.. 1978లో అంటే ఏడాది తరువాత ఇదే 14వ తేదిని టార్గెట్ చేసుకుని జూలై నెలలో ఈ ఇద్దరి సినిమాలు బాక్సాఫీస్ బరిలోకి దిగాయి. ఆ చిత్రాలే.. 'యుగపురుషుడు', 'దొంగల వేట'. విశేషమేమిటంటే.. ఈ రెండు సినిమాల్లోనూ అందాల తార జయప్రద నాయికగా అలరించారు. 

బ‌యోగ్ర‌ఫీః మ‌ధుర‌ స్వ‌రాల విశ్వ‌నాథ‌న్!

త‌ను "ఏ తీగ పువ్వు" అయినా.. "భ‌లే భ‌లే" బాణీల‌తో ప‌లు చిత్ర‌సీమ‌ల్లో ప‌రిమ‌ళించిన సంగీత‌కుసుమం. "ప‌ల్ల‌వించ‌వా నా గొంతులో" అంటూనే "స‌రిగమ‌లు గ‌ల‌గ‌ల‌లు" వినిపించిన అమ‌ర‌గీతాల గ‌ని. "పిల్ల‌లు దేవుడు చ‌ల్ల‌నివారే" అంటూ చిన్నారుల భావాలు చాటిచెప్పినా.. "కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళోయ్ వెర్రెక్కిఉన్నోళ్ళు" అంటూ కుర్ర‌కారు హుషారు తెలియ‌జెప్పినా.. "క‌న్నెపిల్ల‌వ‌ని క‌న్నులున్న‌వ‌"ని క‌వ్విస్తూనే "ప‌ద‌హారేళ్ళ‌ ప్రాయం చేసే చిలిపి ప‌నులు" వ్య‌క్త‌ప‌రిచినా..  "మౌన‌మే నీ భాష ఓ మూగ మ‌న‌సా" అంటూ మ‌న‌సు భాషను ఆవిష్క‌రించినా, "క‌ళ్ళ‌లో ఉన్న‌దేదో క‌న్నుల‌కే తెలుసు" అంటూ క‌న్నుల భావాన్ని ప్ర‌క‌టించినా.. "గాలికి అదుపు లేదు.. క‌డ‌లికి అంతులేదు" అంటూ వేదాంతం ప‌లికినా, "అరె ఏమిటి ఈ లోకం" అంటూ లోకంపై విరుచుకుప‌డినా అది ఆ మ‌ధుర స్వ‌రానికే చెల్లింది. ఆ స్వ‌రానికి మ‌రోపేరే.. మెలోడీ కింగ్ ఎమ్మెస్ విశ్వ‌నాథ‌న్. 

గోపీచంద్ సాహ‌సంకి ప‌దేళ్ళు.. నిధి చుట్టూ తిరిగే యాక్ష‌న్ ఎడ్వెంచ‌ర్

ప్ర‌యోగాత్మ‌క చిత్రాల‌కు పెట్టింది పేరు.. ద‌ర్శ‌కుడు చంద్ర‌శేఖ‌ర్ యేలేటి. ఒక‌దానితో ఒక‌టి పొంత‌న‌లేని క‌థ‌ల‌తో ప్ర‌యాణం చేసే యేలేటి.. 'ఒక్క‌డున్నాడు' (2007) వంటి విభిన్న ప్ర‌య‌త్నం త‌రువాత మ్యాచో స్టార్ గోపీచంద్ తో క‌లిసి చేసిన సినిమా 'సాహ‌సం'.  నిధి చుట్టూ తిరిగే ఈ యాక్ష‌న్ ఎడ్వెంచ‌ర్ ఫిల్మ్ లో తాప్సీ క‌థానాయిక‌గా న‌టించింది. ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు శ‌క్తి క‌పూర్.. తెలుగులో న‌టించిన మూడో సినిమా ఇది.  'క‌లియుగ పాండ‌వులు' (1986), 'యుద్ధ‌భూమి' (1988) లో అల‌రించిన శ‌క్తి క‌పూర్.. దాదాపు పాతికేళ్ళ త‌రువాత న‌టించిన టాలీవుడ్ మూవీ ఇదే కావ‌డం విశేషం. 

మ‌ల్టిస్టార‌ర్ మూవీ 'పుట్టినిల్లు మెట్టినిల్లు'కి 50 ఏళ్ళు.. 'కుండ‌మార్పిడి' ఫ్యామిలీ డ్రామా

సూప‌ర్ స్టార్ కృష్ణ‌, న‌ట‌భూష‌ణ్ శోభ‌న్ బాబు కాంబినేష‌న్ లో ప‌లు జ‌న‌రంజ‌క మ‌ల్టిస్టార‌ర్స్ తెర‌కెక్కాయి. వాటిలో 'పుట్టినిల్లు మెట్టినిల్లు' ఒక‌టి. త‌మిళ చిత్రం 'పుగుంద వీడు' ఆధారంగా తెర‌కెక్కిన ఈ ఫ్యామిలీ డ్రామాకి మాతృక‌ నిర్దేశ‌కుడైన ప‌ట్టు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఏవీయ‌మ్ ప్రొడ‌క్ష‌న్స్ నిర్మించిన ఈ సినిమాలో కృష్ణ‌కి జంట‌గా చంద్ర‌క‌ళ క‌నిపించ‌గా.. శోభ‌న్ బాబుకి జోడీగా ల‌క్ష్మి అభిన‌యించింది. ఒక ముఖ్య పాత్ర‌లో మ‌హాన‌టి సావిత్రి అల‌రించారు. మాతృక‌లో కూడా సావిత్రి, ల‌క్ష్మి, చంద్ర‌క‌ళ ఇవే వేషాల్లో క‌నిపించ‌డం విశేషం.  హాస్య‌జంట రాజ‌బాబు (ద్విపాత్రాభిన‌యం), రమాప్ర‌భ  వినోదం ఈ సినిమాకి ఓ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. 

బ‌ర్త్ డే స్పెష‌ల్ః  మెలోడీబ్ర‌హ్మ కేరాఫ్ ఇండ‌స్ట్రీ హిట్స్

  మ‌ణిశ‌ర్మ అంటే ఇండ‌స్ట్రీ హిట్స్.. ఇండ‌స్ట్రీ హిట్స్ అంటే మ‌ణిశ‌ర్మ.. అన్న‌ట్లుగా ఒక ద‌శ‌లో తెలుగునాట‌ త‌న‌దైన హ‌వా చాటారు స్వ‌ర‌బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ‌.  మెలోడీల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా నిల‌వ‌డ‌మే కాకుండా, బ్యాగ్రౌండ్ స్కోర్ లోనూ బ‌ల‌మైన ముద్ర వేసిన మ‌ణిశ‌ర్మ..  అప్ప‌ట్లో ప‌లు ఇండ‌స్ట్రీ హిట్స్ లో భాగమ‌య్యారు.  1999 సంక్రాంతికి విడుద‌లైన 'స‌మ‌ర‌సింహారెడ్డి'తో తొలి ఇండ‌స్ట్రీ హిట్ ని త‌న ఖాతాలో వేసుకున్న మ‌ణిశ‌ర్మ‌.. ఆపై 2001 సంక్రాంతికి సంద‌డి చేసిన 'న‌ర‌సింహ‌నాయుడు'తో మ‌రో ఇండ‌స్ట్రీ హిట్ ని సొంతం చేసుకున్నారు. అలాగే, అదే ఏడాది వేస‌వికి వినోదాలు పంచిన 'ఖుషి'తో ఇంకో ఇండ‌స్ట్రీ హిట్ లో భాగ‌మ‌య్యారు. 'ఖుషి' అనంత‌రం 2002లో ఇండ‌స్ట్రీ హిట్ గా నిలిచిన 'ఇంద్ర‌'కి కూడా మ‌ణిశ‌ర్మనే బాణీలు క‌ట్టారు. ఆపై 2006లో వ‌చ్చిన 'పోకిరి'తో చివ‌రి ఇండ‌స్ట్రీ హిట్ చూశారు మ‌ణిశ‌ర్మ‌. అలా.. త‌న త‌రం, త‌రువాతి త‌రంలో ఎవ‌రికీ సాధ్యం కాని రీతిలో అత్య‌ధిక సంఖ్య‌లో ఇండ‌స్ట్రీ హిట్స్ చూసిన కంపోజ‌ర్ గా రికార్డ్ నెల‌కొల్పారు మెలోడీ బ్ర‌హ్మ‌.