English | Telugu
బర్త్ డే స్పెషల్ః మెలోడీబ్రహ్మ కేరాఫ్ ఇండస్ట్రీ హిట్స్
Updated : Jul 11, 2023
మణిశర్మ అంటే ఇండస్ట్రీ హిట్స్.. ఇండస్ట్రీ హిట్స్ అంటే మణిశర్మ.. అన్నట్లుగా ఒక దశలో తెలుగునాట తనదైన హవా చాటారు స్వరబ్రహ్మ మణిశర్మ. మెలోడీలకు కేరాఫ్ అడ్రస్ గా నిలవడమే కాకుండా, బ్యాగ్రౌండ్ స్కోర్ లోనూ బలమైన ముద్ర వేసిన మణిశర్మ.. అప్పట్లో పలు ఇండస్ట్రీ హిట్స్ లో భాగమయ్యారు. 1999 సంక్రాంతికి విడుదలైన 'సమరసింహారెడ్డి'తో తొలి ఇండస్ట్రీ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న మణిశర్మ.. ఆపై 2001 సంక్రాంతికి సందడి చేసిన 'నరసింహనాయుడు'తో మరో ఇండస్ట్రీ హిట్ ని సొంతం చేసుకున్నారు. అలాగే, అదే ఏడాది వేసవికి వినోదాలు పంచిన 'ఖుషి'తో ఇంకో ఇండస్ట్రీ హిట్ లో భాగమయ్యారు. 'ఖుషి' అనంతరం 2002లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన 'ఇంద్ర'కి కూడా మణిశర్మనే బాణీలు కట్టారు. ఆపై 2006లో వచ్చిన 'పోకిరి'తో చివరి ఇండస్ట్రీ హిట్ చూశారు మణిశర్మ. అలా.. తన తరం, తరువాతి తరంలో ఎవరికీ సాధ్యం కాని రీతిలో అత్యధిక సంఖ్యలో ఇండస్ట్రీ హిట్స్ చూసిన కంపోజర్ గా రికార్డ్ నెలకొల్పారు మెలోడీ బ్రహ్మ.
ఇక 'ప్రేమించుకుందాం.. రా!', 'చూడాలని వుంది!', 'ఆది', 'ఒక్కడు', 'ఠాగూర్' వంటి బ్లాక్ బస్టర్స్ అయితే మణిశర్మ ఖాతాలో భారీగానే ఉన్నాయనే చెప్పాలి.
(జూలై 11 - మణిశర్మ పుట్టినరోజు సందర్భంగా..)