English | Telugu

కృష్ణ 'నేరము శిక్ష'కి 50 ఏళ్ళు.. యాక్సిడెంట్ చుట్టూ తిరిగే సినిమా!

"మనిషికి మనసే సాక్షి.. మనిషి విధించే శిక్ష తప్పినా.. మనసు వేధించే శిక్ష తప్పదు. నేరానికి శిక్ష తప్పదు.." అనే పాయింట్ తో రూపొందిన చిత్రం 'నేరము శిక్ష'.  రష్యన్ నవల 'క్రైమ్ అండ్ పనిష్మెంట్' ఆధారంగా కళాతపస్వి కె. విశ్వనాథ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో సూపర్ స్టార్ కృష్ణ, భారతి జంటగా నటించారు. కాంతారావు, బాలయ్య, సత్యనారాయణ, రావుగోపాల రావు, అర్జా జనార్థన రావు, కృష్ణకుమారి, పండరీ బాయి, పుష్ప కుమారి, పి. ఆర్. వరలక్ష్మి, ఏడిద నాగేశ్వరరావు, పి. జె. శర్మ, మాస్టర్ విశ్వేశ్వరరావు ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు.  ఎం. బాలయ్య కథను అందించిన 'నేరము శిక్ష'కి సముద్రాల జూనియర్, మోదుకూరి జాన్సన్ సంభాషణలు సమకూర్చారు.