Facebook Twitter
తేట తేట తెలుగు భాష

 

తేట తేట తెలుగు భాష

 



తెలుగు భాష తెల్లవారి ఉదయించే భాష
మధుర భాష మమతల పొదలో వెన్నెల
వాకిట సింగారమైన ముగ్గులోని చుక్కల ఒద్దిక||
సురగంగ గంగ తరంగ జలపాతాల జోరు
అక్ష్రమాల తీరు!
తెలుగు భాష తెలుగు భాష
తెల్లవారి ఉదయించే భాష||
తెల్లతామర తుమ్మెదలో జాలువారు
అక్షర ఒత్తుల, గుణింతాల గమ్మత్తుగా.....
కూర్చిన కూరుపు - చక్కని కూరుపు!
తెలుగు భాష తెలుగు భాష
తెల్లవారి ఉదయించే భాష||
రాయల తెరతీసిన తొలిపలుకుల
జిలిబిలి వెలుగుల తెరపడని,
దేశ భాషలలో గొప్పగా చిక్కిన తీరైన భాష
తెలుగు భాష తెలుగు భాష
తెల్లవారి ఉదయించే భాష||
ఆంధ్రబిడ్డలకి అమృత వాక్యాలను
రంగరించిన ఉగ్గుపాల భాష
తల్లి గురుతులతో పెనవేసుకున్న,
పట్టుసదలని భాష
తెలుగు భాష తెలుగు భాష
తెల్లవారి ఉదయించే భాష||
తెలుగువారికే సొంతమైన అందరాని అందలాల
చిక్కుకున్నా-------అందుకునే కొందరికే తెలిసిన భాష
తెలుగు భాష తెలుగు భాష
తెల్లవారి ఉదయించే భాష||
గొప్పవారికే కాదు పేదవాడి పలుకుల్లోను
పరవళ్ళు తొక్కించి చిందేసిన
చిన్ననాటి భాష
తెలుగు భాష తెలుగు భాష
తెల్లవారి ఉదయించే భాష||
సంధుల,సమాసాలలో వాగుల వంకల
నడుమ తుషార బిందువై
కలువపూలను తడిమిన భాష
తెలుగు భాష తెలుగు భాష
తెల్లవారి ఉదయించే భాష||


- Manohara Boga