Facebook Twitter
తెగిపడిన ఓ జ్ఞాపకం

 

తెగిపడిన ఓ జ్ఞాపకం

 



కన్నీటి సంద్రం లో
ఈదుతూనే వున్నాను
ప్రతి నిత్యం నిను తలుస్తూ !!

నిశ్శబ్దం గా
రాలిపడిన కొన్ని జ్ఞాపకాలు
గుండె ను తడి చేస్తుంటాయి

మౌనం నా నరాల్లో
ప్రవహిస్తుంది
మాట కొమ్మకు వేలాడుతూ!!

కాలం లో నేను
గడ్డ కట్టి పోయాను
తవ్వుకుంటూ
నన్ను నేను ...

నూరు సార్లు
తెగిన ప్రేమ
అతుక్కుంటుంది
ఎక్కడో ఒకచోట... !!

- పుష్యమి సాగర్

సాహితీ కిరణం మాసపత్రిక సౌజన్యంతో