Facebook Twitter
గులాబీలా వికసిస్తుంది

 

గులాబీలా వికసిస్తుంది

 



 
 ఆడదంటే  కస్టాల గూడు అయినా ఆమె సాగుతుంది
ముందుకు సాగుతుంది
తీరమే తెలియకున్నా ముందుకు సాగుతుంది
పడవ గాలికి నిలువ లేకున్నా
కన్నీటి ధారలు వర్షపు జల్లులై కనబడనీకున్నా
ముందుకు సాగుతుంది||

మగాడు  ముల్లులా గుచ్చుకున్నా
గులాబీలా వికసిస్తుంది!
గుండెలోన  ముల్ల బాధ అదుముకొని 
పువ్వులా ఆనందం పంచుతుంది
చూడలేని పాడులోకం
చిద్రం చేసినా
ముందుకు సాగుతుంది||

తేనె పట్టులాంటి జీవితాన
తేనెటీగలేన్ని ముసిరినా
అయినా ఆమె సాగుతుంది
ముందుకు సాగుతుంది
తేనెనే దాచుకొని ముందుకు సాగుతుంది||

పడదోసే పాములెన్ని పైకి ఎగబాకనీకున్నా 
అయినా  సాగుతుంది ఆమె
ముందుకు సాగుతుంది
ఆడదంటే  కస్టాల గూడు అయినా ఆమె సాగుతుంది
ముందుకు సాగుతుంది||