Facebook Twitter
ముళ్ళపూడి వారి మంతనాలు

ముళ్ళపూడి వారి మంతనాలు

 స్వర్గంలో వున్న మన ముళ్ళపూడి వారి మంతనాలు ఫలించాయ్... మళ్ళీ మళ్ళీ రమణగారే గెల్చుకున్నారు బాపు గార్ని.... బాపు గారూ! ఇక సెలవ్... మీ నేస్తం ఎదురుచూపులకు కాలం చెల్లిందంటూ ఈపాటికి సంతోషంగా పరమపద సోపానం ఎక్కుతున్నట్టున్నారు...

బాపూ! నువ్వు ‘కళామతల్లి’కి ఎంత ముద్దుబిడ్డవైనా ఎన్ని అవతరాలతో (ఆర్టిస్ట్, డైరెక్టర్) సేవలందించినా అక్కడ నీకు ‘పద్మా’ల మాలలే... ఇలా తారల్లోకి, నాదాకా వచ్చావా... ఇక ధ్రువతారవే అంటూ రవణగారు పిలుచుకున్నారు కామోసు.....

ఇక్కడ బాపు గారు మనల్ని (శరీరాన్ని) వదిలివేశారో లేదో, అక్కడ స్వర్గంలో కోలాహలం మొదలైందిట... ఆప్తమిత్రుణ్ణి ఆలింగనం చేసుకోవడానికి రవణగారు రంగం సిద్ధం చేసుకుంటున్నారనుకుంటున్నారా! అదీ నిజమే... అయితే ఆ హడావిడి వెనక అసలు గమ్మత్తేంటంటే... రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమలు బాపు గార్కి మత్తెక్కించేందుకు వెల్‌కమ్ డ్రింక్‌తో రెడీ అయిపోతే ఇక తక్కిన అప్సరసలు అంతా ‘స్వాగతం దొరా!’ అంటూ డ్యాన్సు కట్టే పనిలో బిజీగా వున్నార్ట. అదంతా ఆ రంగుల రారాజుని ఆకర్షించడానికి స్వర్గంలోని ఆడాళ్ళంతా కల్సి వేసిన ప్లాన్ అని మనకి తెలీనిదా?!

...... More