Facebook Twitter
వలచి వచ్చిన వనిత - 6


  వలచి వచ్చిన వనిత

-వసుంధర

 

పార్ట్ - 6

 

 

    "మీరెవరో నాకు తెలియదు_" అంది పార్వతి.

    "అబద్ద మాడకు పార్వతీ-..."అన్నాను.

    "ఆమె పేరు పార్వతి కాదు__" అన్నాడా యువకుడు.

    "ఇంట్లోంచి పారిపోయిన వాళ్ళు పేరు మార్చుకోవడం అసహజం కాదు__"అన్నాను చలించకుండా.

    "ఎవరండీ మీరు? అంత నమ్మకంగా మాట్లాడుతున్నారు__ఈమె మీ కేమవుతుంది?" అన్నాడా యువకుడు చిరాగ్గా.

    "ఈమె నాస్నేహితుడి చెల్లెలు. ప్రస్తుతం ఈమె  అన్న  ఈమె గురించి అన్వేషణలో ఉన్నాడు." అన్నాను.

    "మీరు నిజంగా  పొరబడ్డారు. ఈమెపేరు శారద. మీరనుకుంటున్న పార్వతి ఈమె  కావడం  అసంభవం__" అన్నాడా యువకుడు.

    "ఎందువల్ల?" అన్నాను అసహనంగా.

    "ఎవరైనా పరాయివాడు మీ ఆవిణ్ణి పార్వతీ అని  పిలిచినప్పుడు__ఆ పేరునిజమో, తప్పో మీకుతెలియదా?" అనడిగింది పార్వతి.

    "అంటే__?"

    "మే మిదరం భార్యాభార్తలం-" అన్నాడా యువకుడు.

    ఆశ్చర్యపడ్డాను. నాకదంతా సంభవం అనిపించలేదు_ "ఎన్నాళ్ళయింది మీవివాహమై?" అనడిగాను.

    "పదినెలలు_"

    పార్వతిలో ఆ అపూర్వాను భవం జరిగి ఇంకా  రెండునెలల పూర్తికాలేదు. అందుకే "రెండునెలలు క్రితం మీభార్య తన అన్నగారింటికి వెళ్ళడం సంభవించి ఉండాలి! "అన్నాను.

     ఆ యువకుడు నావంక జాలిగాచూసి_"మీరు చూడ్డానికి  పెద్ద మనిషిలా కనబడుతున్నారు. మీరనుకుంటున్న పార్వతి  అన్న మీకు నిజంగా  ప్రాణస్నేహితుడై  ఉండాలి, నా భార్యకూ __ఆ పార్వతికీ  పోలికలున్నాయేమో నాకు తెలియదు. ఈమె  పార్వతి కాదనీ  శారద అనీ  మరోసారి  చెబుతున్నాను. గత  ఎనిమిది మాసాలుగా మేమిద్దరం ఒకరిని విడిచి ఒకరు  ఉండడం జరగలేదు. దయఉంచి మీరు మమల్నింక వేధించవద్దు__"అన్నాడు.

    "మీ స్నేహితుడి చెల్లెల ఫోటో ఒకటి ఉంటే ఇవ్వండి. అనుకోకుండా ఆమె మాకు తటస్ధ పడితే-మీకు  సహాయ పడాతం-" అంది  నేను పార్వతిగా భావిస్తుంటే కాదు శారదని అంటున్న ఆమె.

    పార్వతికి నేను మగవాడు ఆడదానికి అనగలిగినంత దగ్గరా  అయ్యాను. ఆమెను గుర్తించడంలో పొరపాటు చేయలేను. అప్పటికి ఊరుకున్నా  ఈ విషయన్నింతటితో  వదల దల్చుకోలేదు.

    టిఫిన్ చేసి బయటకు వచ్చేక__హొటల్ లో ఒక క్డీనర్  కుర్రాడితో మాట్లాడాను వాడికి తరచుగానేను చిల్లర డబ్బులు బక్షీస్ గా ఇస్తుంటాను. ఆ జంట ఇంటి అడ్రస్  తెలుసుకో  వలసిందిగా వాడిని కోరాము ప్రోప్రయిటర్ పర్మషన్ తీసుకు ఆ కర్రవాడు జంట వెంటపడ్డాడు.

    మర్నాడుదయం హొటల్ కు వెళ్ళాను. "వాళ్ళు  తిన్నగా   సినిమాకు పోయారుసార్! నేనూ  పోయానుమరి. రాత్రి  పదిన్నరకు  వాళ్ళు ఇల్లు చేరుకున్నారు__" అంటూ కుర్రాడు చిరునామా ఇచ్చాడు వాడికి పదిరూపాయలు ఇచ్చాను.  

   

    తలుపు తట్టాను కానీ కాస్త భయంగానే ఉంది. ఆమె నన్ను గురించి ఏమనుకుంటుందో, తనునిజంగా  పార్వతి  కాకపోతే  భర్త లేని  సమయంలో  ఇంటికీ  వచ్చినందుకు-ఏ విధంగా భావిస్తుందోనన్న జంకు నాలో ఉంది.

    తలుపులు తెరుచుకున్నాయి. బహుశా  తలస్నానం  చేసిందేమో- జుట్టు  విరబోసుకుని  ఉందామె. సందేహం లేదు__ నేను పొరబడడంలేదు ఈమె పార్వతేనని అనిపించింది.

    "మీరా." అందామె తడబడుతూ.

    "గుర్తుపట్టారన్నమాట__ "అనినవ్వి__ "లోపలకు  రావచ్చా! "అన్నాను.

    "వారు ఇంట్లోలేరు_" అందామెజంకుతూ.
   
    "తెలిసేవచ్చాను-" అంటూ ముందడుగు వేశాను.

    "మీకేదైనా పని ఉంటే వారున్నప్పుడు రావచ్చు. సాయంత్రం అయిదు గంటలకు వారు తిరిగివస్తారు__" అందామె.

    "అయితే సాయంత్రం అయిదుగంటలవరకూ అతను రాడన్నమాట"! అంటూ  తలుపులువేశారు.

    ఆమె బెదురుకళ్ళతో నావంక చూస్తూ __ "మీరే  ఉద్దేశ్యంతో ఇక్కడకు వచ్చినా__నలుగురూ చెడు ఉద్దేశ్యంతో వచ్చినట్లే భావిస్తారు. నా కాపురంలో నిప్పులు పోయకండి-" అందామె.

    నేను తడబడ్డాను. నిజ్మగా నేనొక అమాయకురాలిని బాధించడం లేదుకద_ అనిపించింది! అయినా నెమ్మదిగా__"పార్వతిని నేనుమరిచిపోలేదు. ఒకటికాదు రెండుకాదు__ పదహారురోజులు ఆమె నాదానిగా మసలింది. ఆమెతో గడిపిన ప్రతిక్షణం మధురం, అపూర్వం! ఆ పార్వతిని గుర్తుపట్టడంలో నేను పొరపడను. నువ్వుపార్వతివి. కాదనకు. అప్పుడు  నీకు  దూరంగాఉండడానికి ప్రయత్నిస్తే రెచ్చగొట్టిదగ్గరచేసుకున్నావు ఇప్పుడు  దగ్గరకు  రావడానికి ప్రయత్నిస్తూంటే అబద్దాలు చెప్పి__ పోమ్మంటున్నావు. నీ విచిత్ర ప్రవర్తనకు  కారణం  తెలియడంలేదు__" అన్నాను.

    "మీ ప్రవర్తనే నాకు విచిత్రంగాఉంది. వివాహితురాలైన ఆడదాని వెంటపడి బాధించడం మీకు భావ్యంకాదు. మీరిలా వచ్చివెళ్ళినట్లు నా భర్త చూస్తే ఏమను కుంటారు"! అందామె ఇంచుమించు కళ్ళనీళ్ళ పర్యంతమై.

    "నువ్వు గొప్పనటివి పార్వతీ__" అనుకున్నాను. అదే  సమయంలో ఎవరో తలుపు తట్టాయు పార్వతి కంగారుపడింది "ఎవరో వచ్చారు__ నామీద దయఉంచి మీరుకాస్త ఆ  పక్క గదిలోకి వెళ్ళగలరా" అంది.

    "నేను దొంగనుకాదు. దాక్కోవలసిన అవసరంలేదు__" అన్నాను.

    "కానీ మిమ్మల్ని  దాచవలసిన అవసరం నాకుంది___ప్లీజ్__" అంటూ ఆమె నా చెయ్యిపట్టుకుని పక్కగదిలోకి  లాక్కువెళ్ళి ఓ బీరువాపక్క నిలబెట్టి__" వచ్చినవాళ్ళు వెళ్ళే  వరకూ__ ఇక్కణించి కదలవద్దు__" అని వెళ్ళిపోయింది.

    ఆఖరికి ఏగతి పట్టింది నాకు!

    వచ్చిన వ్యక్తి ఆడదని కంఠం చెబుతూనే ఉంది__ "ఎలా  ఉందమ్మా కొత్తకాపురం?" ఆ అడకంఠం కంగుమని మ్రోగుతుంది.

    పార్వతి మాట  వినపడలేదు.

    "చూడమ్మా__కొత్తగా వచ్చావు. ఈవీధిలో ఎవ్వరూ కలుపుగోరు మనుషులుకాదు. కొత్తగా ఎవరు వచ్చినా ఒకటి రెండురోజులు చూసి నేనే వచ్చి పలకరించి పోతూంటాను. ఏదైనా సాయంకావాల్సివస్తే అడగడానికి సందెహించకూ___" అందాకంఠం మళ్ళీ.

    "అలాగేనండి___" పార్వతి కంఠం.

    మరోపావుగంట మాట్లాడేక ఆ కంఠం వెళ్ళిపోయింది. తలుపులు వేసి పార్వతి నాదగ్గరకువచ్చింది. "చూశారా__నన్నె లాంటి ఇబ్బందిలో పెట్టారో ___ఆవీడ మీరు లోపలకు రావడం చూసే ఉంటుందని నా అనుమానం __"అంది పార్వతి.

    "తప్పులేనిచోట భయంకూడా ఉండదు___" అన్నాను వెటకారంగా.

    "అభయం ఆడదానికి తెలుస్తుంది. మగవాడికి అర్ధం కాదు__" అందామె.

    "భయపడే ఆడదానికీ. భయపడని ఆడదానికీ తేడా__ మగవాడికి తెలుస్తుంది__" అంటూనేనామెను సమీపించి దగ్గరగా  లాక్కున్నాను. ఒంటరితనం, పూర్వపు చనువు__నాకు  ఆవేశాన్ని కలిగించగా నేను కాస్త ధైర్యం చేశాను. ఆమెమాట్లాడకుండా వణుకుతుంది. మరి భయమో ఏకారణం తెలియదు____ఆమె అరవలేదు కానీ గింజు కుంటోంది వీలైనంత మౌనంగా.

    ఆమాత్రం చాలునాకు. ప్రస్తుతం శ్రీధరబాబు చెల్లెలు ఇక్కడెందుకున్నదీ అన్న  వివరంమీద నాకు  ఆసక్తి లేదు. ఆ అవకాశాన్ని వినియోగించుకోవడం మీదనే నా ఆసక్తి!

    "ఒకప్పుడు నీ  గురించి రెండువేలు ఖర్చుపెటాను. నాకు డబ్బు లెక్కలేదని గ్రహించే ఉంటావు. నీ భర్త అయిదు గంటల వరకూ రాడుకదా__ మనకుచాలా సమయం ఉంది___" అన్నాను.